ముఖం పై యాక్నే మచ్చలు పోగొట్టడానికి ఈ పద్ధతులు పాటించండి....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. చాలా మంది యాక్నే సమస్యలతో బాధ పడుతుంటారు. ఈ పద్ధతులు పాటించండి.. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి..ఒక టేబుల్ స్పూన్ ఎండిన కమలా పండు తొక్కల పొడి, ఒక టీ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ ముల్తానీ మిట్టీ, ఒక టీ స్పూన్ నిమ్మ రసం, తగినంత నీరు కలిపి స్మూత్ పేస్ట్ లా చేయండి. డార్క్ స్పాట్స్ ఉన్న చోట ఈ మిశ్రమాన్ని అప్లై చేసి ఆరనివ్వండి. ఆరిన తరువాత కొద్ది గా నీరు చల్లి మీ వేళ్ళతో గుండ్రంగా మసాజ్ చేయండి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. వారానికి మూడు నాలుగు సార్లు ఇలా చేయవచ్చు.రెండు టేబుల్ స్పూన్ల తేనె లో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మ రసం వేసి కలపండి. అవసరమున్న చోట ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి. గోరు వెచ్చని నీటిలో మెత్తటి బట్ట ముంచి పిండేసి ఆ బట్టని ఈ మిశ్రమం అప్లై చేసిన చోట కవర్ చేసినట్లుగా వేయండి. ఇరవై నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి.

ఇలా వారానికి ఒక సారి మీకు ఫలితం కనిపించే వరకూ చేయవచ్చు.అర కప్పు యాపిల్ సిడార్ వెనిగర్ లో అర కప్పు నీరు కలపండి. పిగ్మెంటేషన్ ఉన్న చోట ఈ నీటిని పోయండి. నాలుగైదు నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా రోజుకి రెండు సార్లు నెల రోజుల పాటూ చేయండి.ఒక బౌల్ లో ఐదారు టీ స్పూన్ల పసుపు తీసుకుని అందులో తగినంత పాలు పోసి స్మూత్ పేస్ట్ లా చేయండి. ఎఫెక్ట్ అయిన ఏరియా మీద ఈ పేస్ట్ అప్లై చేసి ఐదు నిమిషాలు గుండ్రంగా మసాజ్ చేయండి. ఆ తరువాత ఇరవై నిమిషాల పాటూ వదిలేయండి. గోరు వెచ్చని నీటితో కడిగేయండి...

రోజూ స్నానానికి ముందు ఒక సారి ఇలా చేయవచ్చు.ఫ్రెష్ అలో వెరా పల్ప్ రెండు టేబుల్ స్పూన్లు, తేనె ఒక టేబుల్ స్పూన్ తీసుకుని రెండింటినీ బాగా కలపండి. పిగ్మెంటేషన్ ఉన్న చోట అప్లై చేసి ఇరవై నిమిషాలు వదిలేయండి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా రోజుకి ఒక సారి రెండు మూడు వారాలు చేయవచ్చు. ఆ తరువాత రోజు విడిచి రోజు చేయవచ్చు.ఇక ఇలాంటి మరెన్నో బ్యూటీ టిప్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: