విటమిన్ ఇ క్యాప్సిల్స్ శరీరంలో కలిగే మార్పులకు సహాయపడగలవా.?

Divya

వాతావరణంలో కలిగే మార్పుల కారణంగా శరీరంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. అయితే అందులో ఒక రోజు మన శరీర అందం రెట్టింపు అయితే, మరొక రోజు నిర్జీవంగా,అలసటగా తయారవుతుంది. అలా చర్మంలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూనే ఉంటాయి. కాబట్టి సీజన్ను బట్టి శరీరంతో పాటు చర్మంలో కూడా మార్పులు రావడం సహజం.  ఇలా మన చర్మంలో మార్పులు రావడానికి గల కారణాలు ఏదైనప్పటికీ విటమిన్ ఇ  క్యాప్సిల్స్ మాత్రం అందుకు తగ్గట్టుగా సహాయపడతాయి. మన చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి ఎలాంటి సీజన్లోనైనా నిరభ్యంతరంగా విటమిన్ ఇ క్యాప్సిల్స్ ను  ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ విటమిన్ ఇ  క్యాప్సిల్స్ ఎలా?ఏవిధంగా? ఉపయోగించి మన చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చో? ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..
చర్మ సౌందర్యానికి అవసరమైన విటమిన్స్ లలో  విటమిన్ ఇ కూడా ఒకటి. అందుకే ప్రస్తుత కాలంలో ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్  లో విటమిన్ ఇ ని ఎక్కువగా ఉండే లాగా చూసుకుంటున్నారు. విటమిన్ ఇ చర్మసౌందర్యానికి ఉపయోగపడి  చర్మం కాంతివంతంగా, యవ్వనంగా ఉండడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం విటమిన్ ఇ  క్యాప్సిల్స్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత వీటిని ఎంతో మంది ఎన్నో రకాలుగా ఉపయోగించడం మొదలుపెట్టారు.
విటమిన్ ఇ క్యాప్సిల్స్ చర్మంలోని తేమను కాపాడుతుంది. దీని వల్ల చర్మం కాంతివంతంగా, సున్నితంగా తయారవుతుంది. విటమిన్ ఇ  క్యాప్సిల్స్  చర్మానికి మంచి ఫలితాన్ని ఇవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా రాత్రి పూట మాత్రమే మీరు ఉపయోగించాల్సి ఉంటుంది. మీరు వాడే  క్రీమ్ లో కొద్దిగా ఈ విటమిన్ ఇ  క్యాప్సిల్స్ ను  వేస్తే ముఖానికి అద్భుతంగా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు మీరు వాడే రెగ్యులర్ ఫేస్ క్రీమ్ లో కొద్దిగా విటమిన్ ఇ  క్యాప్సిల్స్ కలిపి ముఖానికి పట్టించి నిద్రపోవాలి. ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో కడిగేసుకుంటే తాజాదనంతో నింపుకున్న అందమైన చర్మం మీ సొంతమవుతుంది.

అంతేకాకుండా విటమిన్ ఇ  క్యాప్సిల్స్ ఫేస్ మాస్క్ లా  కూడా ఉపయోగించుకోవచ్చు. విటమిన్ ఇ క్యాప్సిల్స్ లో లో  సోలబుల్ న్యూట్రిషియన్స్ అధికంగా ఉంటాయి.  వాటర్ సోలబుల్ ను   ఉపయోగించడం వల్ల ఇది డ్రై గా మారిన స్క్రీన్ ను హైడ్రేటింగ్ గా మార్చుతుంది. తద్వారా చర్మానికి కావలసిన తేమ అంది,చర్మం సున్నితంగా, మృదువుగా తయారవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: