గంధం ఫేస్ ప్యాక్ ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా..?

Divya

ప్రస్తుతకాలంలో అమ్మాయిలు అందం కోసం ఎన్నో క్రీములు, కాస్మెటిక్స్ వాడుతున్న విషయం అందరికీ తెలిసిందే.అంతేకాకుండా ఎన్నో రకాల ఫేస్ ప్యాక్ లను కూడా వేస్తుంటారు.  మరి అదే పూర్వకాలంలో ఇలాంటి క్రీములు,  కాస్మెటిక్స్, ఇన్స్టెంట్ ఫేస్ మాస్క్ లు అంటూ ఏవీ  లభించేవి కావు . వారు కేవలం ఇంట్లో దొరికే వాటితోనే ఫేస్ ప్యాక్ లు వేసుకునేవారు. మరీ ముఖ్యంగా అందాన్ని పెంపొందించాలంటే మొట్టమొదటిసారిగా అందుబాటులోకి వచ్చిన సౌందర్య సాధనం గంధం చెక్క. ఈ గంధం చెక్కను సానరాయి పైన అరగదీసి,ఆ పేస్టును ముఖానికి రాసుకోవడం వల్ల ఎన్నో రకాల సౌందర్య ప్రయోజనాలు చేకూరుతాయని అప్పటి గ్రంధాలలో లిఖించబడింది. అయితే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం కూడా ఒకసారి తెలుసుకుందాం.
ప్రస్తుతం ఉన్న తరానికి దీని గురించి పెద్దగా తెలియక పోవచ్చు. కానీ దీని తయారీ విధానం మాత్రం పెద్ద కష్టమేమీ కాదు. ఇందుకోసం గంధపు చెక్క,సానరాయి, మంచినీళ్లు, ఒక చిన్న గిన్నె తీసుకోవాలి. ఇప్పుడు సాన రాయి తీసుకొని దానిపై రెండు చుక్కల నీటిని వేసి, ఇప్పుడు దానిపై గంధం చెక్కను అరగదియ్యాలి.
 ఇలా బాగా అరగదీసిన మిశ్రమాన్ని  ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చేతి వేళ్లతో తీసుకొని ముఖానికి పట్టించి, ఒక గంట వరకు ఆరనివ్వాలి. ఆ తరువాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం ఎంతో మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది. ఈ పద్ధతిని వారానికి రెండుసార్లు చేస్తే,ఎలాంటి ఖర్చు లేకుండా అందమైన చర్మం మీ సొంతం అవుతుంది.
ప్రస్తుతం మార్కెట్లో దొరికే ఎన్నో రకాలైన కెమికల్స్ కలిగిన ప్రొడక్ట్స్ ని తెచ్చి, ముఖానికి వాడి.ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన  పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇలాంటి పద్ధతులన్నింటిని దూరం పెట్టి, సహజసిద్ధమైన గంధపుచెక్క ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజంగా చర్మ అందాన్ని పెంపొందించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: