జుట్టు మెరిసిపోవడానికి ఈ హెయిర్ మాస్క్ ట్రై చెయ్యండి...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...అందమైన నిగ నిగ లాడిపోయే మెరిసే  జుట్టు  కోసం మీరు ఎలాంటి బ్యూటీ పార్లర్ కి గాని  హెయిర్ సెలూన్ కి వెళ్ళవలసిన అవసరం లేదు. నాచురల్ ఇన్‌గ్రీడియెంట్స్ తోనే మీరు హెయిర్ మాస్క్స్ వేసుకోవచ్చు. తేనె, అరటి పండు, ఎగ్స్, బెర్రీస్, పెరుగు, కోకోనట్ మిల్క్, గ్రీన్ టీ వంటివన్నీ హెయిర్ మాస్క్స్ కి పనికొచ్చేవే. కేవలం కెమికల్స్ మాత్రమే ఉన్న హెయిర్ మాస్క్స్ ఎంత ఎఫెక్టివ్ గా పని చేస్తాయో, ఇవి కూడా అంతే ఎఫెక్టివ్ గా పని చేస్తాయి.ప్రతి రోజు హెయిర్ మాస్క్స్ ఉపయోగించడం  వల్ల ఎన్నో ప్రయోజనాలు  ఉన్నాయి..ఇక ఈ మాస్క్ ని ఇంట్లో కూడా మీరు తయారు చేసుకోవచ్చు. ఎలా చెయ్యాలో తెలుసుకోండి..
అర కప్పు గ్రీన్ టీ తయారు చేయండి. వడకట్టి పక్కన పెట్టి చల్లార నివ్వండి. ఒక బౌల్ లో రెండు నుండి నాలుగు టేబుల్ స్పూన్ల బెటొనైట్ క్లే వేయండి. ఇది స్టోర్స్ లో దొరుకుంతుంది, లేదంటే ఆన్లైన్ లో కూడా ఈజీగా లభిస్తుంది. ఈ క్లే లో గ్రీన్ టీ వేసి థిక్ పేస్ట్ లా తయారయ్యేంత వరకూ కలపండి. మీ స్కాల్ప్ కి అప్లై చేసి పదిహేను నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయండి.దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. జుట్టు కూడా చాలా హెల్తీ గా షైనీగా ఉంటుంది..
హెయిర్ స్టైలింగ్ ప్రోడక్ట్స్, హీట్ స్టైలింగ్ టూల్స్ బాగా వాడుతూ ఉంటే జుట్టు డ్రై గా అయిపోతుంది, హెయిర్ డ్యామేజ్ కూడా జరగవచ్చు. ఇలా డ్యామేజ్ అయిన హెయిర్ మళ్ళీ కళకళలాడాలంటే నరిషింగ్ హెయిర్ మాస్క్ బాగా హెల్ప్ చేస్తుంది. ఈ మాస్కులు  జుట్టుని తేమగా ఉంచుతాయి, జుట్టుకి అవసరమైన పోషణని అందిస్తాయి.వారానికి ఒకసారి చేసే హెయిర్ మాస్క్ ట్రీట్మెంట్ వల్ల జుట్టు స్మూత్ గా మెరుస్తూ  షైనీ గా తయారవుతుంది. జుట్టు ఎక్కువ ఆయిలీగా ఉంటోందనో, చుండ్రు పెరుగుతోందనో వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు.కొంచెం వయసులో పెద్ద వాళ్ళు తెల్ల జుట్టుకి రంగు వేసినా, చిన్న పిల్లలు సరదా కొద్దీ హెయిర్ కలర్ వేయించుకున్నా అందులో కెమికల్స్ లేకుండా అయితే ఉండవు. ఫలితం, నిర్జీవమైన జుట్టు. ఈ సమస్యకి కూడా హెయిర్ మాస్క్ తో పరిష్కారం చూపవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: