ఈ చిట్కాలు పాటిస్తే మీ ముఖం నిగనిగలాడటం ఖాయం...
కొన్ని రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది.స్ట్రాబెర్రీ, మిల్క్ క్రీంతో తయారుచేసిన ఫేస్ ప్యాక్ ట్యాన్‌ను చాలా ప్రభావవంతంగా పోగొడుతుంది. అంతేకాదు డార్క్ స్పాట్స్ ని సైతం చర్మం రంగులో కలిసిపోయేలా చేస్తుంది.కొన్ని స్ట్రాబెర్రీలను తీసుకొని వాటిని స్పూన్ సాయంతో లేదా బ్లెండర్లో వేసి మెత్తగా చేయాలి. దీనికి రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ క్రీం కలపాలి. ఈ రెండింటినీ బాగా కలిపి ముఖానికి ప్యాక్ మాదిరిగా అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది.
బాగా ముగ్గిన బొప్పాయి పండు ముక్క తీసుకొని బాగా మెత్తగా చేసుకోవాలి. దీనికి చెంచా తేనె కలిపి.. రెండూ బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే మంచి ఫలితం కనిపిస్తుంది.ఇక ఇలాంటి మరెన్నో బ్యూటీ టిప్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి..