గుడ్డు ఫేస్ ప్యాక్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా..

Divya

సాధారణంగా రోజుకు ఒక గుడ్డు తినడం వల్ల,ఎన్నో పోషక పదార్థాలను మన శరీరానికి అందించిన వాళ్ళం అవుతాము. కోడిగుడ్డు వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. కోడి గుడ్డు లో విటమిన్లు, ఖనిజాల తో పాటు సెలీనియం,క్యాల్షియం, మెగ్నీషియం,పొటాషియం, భాస్వరం ఇతర పోషకాలు తో నిండి ఉంటుంది. గుడ్డు యొక్క పచ్చసొనలో లెసిథిన్ ఉంటుంది.ఇది హైడ్రేషన్ ను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. అయితే గుడ్డు శరీరానికే కాకుండా ముఖ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. గుడ్డు ఫేస్ ప్యాక్ వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో?దాన్ని ఎలా వేసుకోవాలో? ఇప్పుడు తెలుసుకుందాం.

 గుడ్డులోని తెల్ల సొన చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి, హానికరమైన చర్మ సమస్యలను దూరం చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ముఖంమీద ఏర్పడ్డ బ్లాక్ హెడ్స్,వైట్ హెడ్స్ లను తొందరగా తగ్గించి వేస్తుంది. గుడ్డులోని లూటిన్ చర్మాన్ని హైడ్రేట్ చేయడమే గాక చర్మం స్థితిస్థాపకత ను పెంచుతుంది. ఇక అలాగే చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా తయారు చేయడానికి గుడ్డు ఎంతగానో సహకరిస్తుంది.
మొటిమలను తగ్గించడంలోనూ, గుడ్డు తెల్ల సొన మొదటి పాత్ర వహిస్తుంది. గుడ్డులోని తెల్ల సోన అధిక నూనె,మృతకణాలను తొలగించి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే లైసోజైమ్ అనే ఎంజైమ్ మొటిమలకు కారణం అయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. కాబట్టి గుడ్డులోని తెల్లసొనను ఫేస్ ప్యాక్ లా వేసుకోవడం వల్ల మొటిమలు తగ్గడమే కాకుండా  చర్మం నుంచి అదనపు నూనెను గ్రహించి, చర్మం కాంతివంతంగా ఉండేలా చేస్తుంది.
గుడ్డులో లూటీన్, యాంటీ ఆక్సిడెంట్ లు అధికంగా ఉండడం వల్ల ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. గుడ్డు ఫేస్ ప్యాక్ ను మాస్క్ లా వేసుకోవడం వల్ల చర్మం మీద ఉన్న ముడతలు కూడా తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే గుడ్డు కు యాంటీ ఏజింగ్  లక్షణాలు ఎక్కువ. ఫలితంగా గీతలు, ముడతలు, ఎలాంటి మచ్చలు అయినా సరే గుడ్డు ఫేస్ ప్యాక్ వల్ల తగ్గించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: