కరివేపాకుకు కాలిన గాయాలను నయం చేయగల శక్తి ఉందా..?

Divya
కరివేపాకు చెట్టు యొక్క ఆకులను శాస్త్రీయంగా కోయినిగి స్ప్రెంగ్ అని పిలుస్తారు. ఇది రూటాసియే కుటుంబానికి చెందినది. ఎక్కువగా ఉష్ణ మండలి తో పాటు ఉప ఉష్ణ మండలి ప్రాంతాల్లో కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా చైనా,ఆస్ట్రేలియా, నైజీరియా తోపాటు సిరోన్ వంటి ఇతర దేశాలలో కరివేపాకు సాగు చేస్తారు. ఈ మొక్క యొక్క ఆకులు,వేర్లు,కాండం ఇలా అన్నింటినీ వివిధ ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు.

ఆకులు ఎల్లప్పుడూ వాటి ప్రత్యేకత రుచి వల్ల,వంటలలో అధిక రుచి కోసం ఉపయోగిస్తారు. కరివేపాకులో ముఖ్యంగా ప్రధాన పోషకాలైన కార్బోహైడ్రేట్లు,ఫైబర్, క్యాల్షియం,ఫాస్పరస్,ఇనుము, మెగ్నీషియం, రాగి తో పాటు ఇతర ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా నికోటినిక్ ఆమ్లము తో పాటు విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ ఈ,యాంటీఆక్సిడెంట్లు, ప్లాస్టి స్టేరాల్స్, అమైనో ఆమ్లాలు, గ్లైకోసైడ్ తో పాటు ఫ్లేవనాయిడ్స్ వంటి విటమిన్లు కలిగి ఉంటుంది. కరివేపాకులో దాదాపు 100 గ్రాములకు గానూ 0.1 గ్రాముల కొవ్వు మాత్రమే ఉంటుంది.
అయితే కరివేపాకును కేవలం ఆరోగ్యానికే కాకుండా చర్మ సంరక్షణకు, జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగిస్తారు. కరివేపాకును చర్మ రక్షణ కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. కరివేపాకు ఆకులను రసంగా చేసుకొని లేదా ఆకులను ముద్దగా నూరి పేస్టులా తయారుచేసి, చర్మం ఎప్పుడైనా కాలినప్పుడు,  గాయాలు తగిలినప్పుడు, దురదలు వంటివి ఏర్పడినప్పుడు వాటిపై ఆకుల పేస్టును కానీ,రసాన్ని గాని పట్టించడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది.

ఈ ఆకులలో ముఖ్యంగా అనామ్లజనకాల తోపాటు అమైనో ఆమ్లాలు జుట్టు సంరక్షణలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఇందుకోసం మీరు చేయవలసిందల్లా.. కరివేపాకులను కొబ్బరి నూనెలో వేసి మరిగించి, ఆ నూనెను వడగట్టి,జుట్టుకు పట్టించి,మర్దనా చేయడం, లేదా కరివేపాకులను పేస్టులా చేసి,  జుట్టుకు,తలకు పట్టించడం లాంటి పనులు చేయడం వల్ల,జుట్టు సమస్యలు అన్ని తొలగిపోతాయి.  జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. ఇక అంతే కాకుండా జుట్టు రాలిన ప్రదేశంలో కొత్త జుట్టు మొలచడాన్ని మనం గమనించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: