ఒత్తయిన జుట్టు మీకూ కావాలా..? అయితే ఇలా చేయండి..!

Divya

సాధారణంగా ప్రతి అమ్మాయి ఒత్తయిన జుట్టు కోసం ఎన్నో చిట్కాలను పాటిస్తూ ,హెయిర్ ప్యాక్ లు వేస్తూ ఉంటుంది. ఇలా వేలకు వేలు ఖర్చు పెట్టి,మార్కెట్లో దొరికే ఎన్నో రకాల ప్రోడక్ట్స్ తెచ్చి జుట్టుకు వాడుతుంటారు. అయితే ఫలితం ఎంత వరకు లభిస్తుందో అనే మాట తెలియదు కానీ, వాటిలో వాడే రసాయనాల కారణంగా జుట్టు నిర్జీవంగా, గడ్డి లాగా మారి చూడడానికి అసహ్యంగా కనిపిస్తుంది. అయితే ఇలాంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టే రోజు రానే వచ్చింది. అయితే ఇప్పుడు మేము చెప్పబోయే కొన్ని సింపుల్ చిట్కాలను పాటించి, మీ జుట్టు నిగనిగ లాడుతూ, ఒత్తుగా పెరిగేలాగా చేసుకోండి.. అయితే ఎలాంటి చిట్కాలు పాటించాలో?ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాము.


క్యారెట్ హెయిర్ ప్యాక్ :
క్యారెట్ హెయిర్ ప్యాక్ వెంట్రుకలను దృఢంగా ఉంచడానికి సహాయపడుతుంది. క్యారెట్స్ లో విటమిన్ బి 7 అనగా బయోటిన్  అధికంగా ఉండడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి దీనిని ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి. అంతేకాకుండా జుట్టుకు కూడా హెయిర్ ప్యాక్ లా వేసుకోవడం వల్ల  మంచి ప్రయోజనం కలుగుతుంది. ఇందుకోసం ముఖ్యంగా క్యారెట్లను బాగా కడిగి, ముక్కలుగా కోసి ఉడకబెట్టాలి. ఇలా ఉడకబెట్టిన క్యారెట్ ముక్కలను మెత్తగా పేస్ట్ చేసి, ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి,అరగంట పాటు ఆరనివ్వాలి. ఆ తరువాత గాఢత తక్కువగా కలిగిన షాంపూతో తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

గ్రీన్ టీ :
కుదుళ్ళకు గ్రీన్ టీ ని ప్యాక్ వేయడం వల్ల జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం ఒక రెండు- మూడు గ్రీన్ టీ బ్యాగులను,పావు వేడి నీటిలో అద్ది, చల్లారాక జుట్టు కుదుళ్ళకు పట్టించి,మర్దనా చేయాలి. 10 నిమిషాలు ఆరిన తర్వాత, శుభ్రంగా కడిగి వేసుకోవాలి. అయితే ఈ ప్యాక్ జుట్టుకు కండిషనర్ లా పనిచేసి, జుట్టు నిగనిగలాడేలా చేస్తుంది.

మందారం హెయిర్ ప్యాక్ :
మందారం పువ్వులను ఎండలో ఎండబెట్టి, పొడి చేసుకొని, మూడు టేబుల్ స్పూన్ల పెరుగులో, ఒక టేబుల్ స్పూన్ మందారం పొడి కలిపి,జుట్టు కుదుళ్లకు పట్టించాలి. ఆ తర్వాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: