ఎర్ర కందిపప్పు అందానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో మీకు తెలుసా..?

Divya

సాధారణంగా ఎర్ర కందిపప్పు ను ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుచుకుంటుంటారు.  కొన్ని ప్రాంతాల్లో మైసూర్ పప్పు అని పిలిస్తే, మరికొన్ని ప్రాంతాల్లో మసూర్ పప్పు, ఎర్ర కందిపప్పు అని కూడా పిలుస్తారు. అయితే ఈ ఎర్ర కందిపప్పు ను దక్షిణ భారతదేశంలో చాలా మంది పప్పు చేసుకోవడానికి ఉపయోగిస్తారు. కందిపప్పులో మనకు చాలా రకాల ప్రోటీన్లు ఉంటాయి. ఎర్ర కందిపప్పులో పోషకాలు,ఖనిజాలు పుష్కలంగా లభించడమే కాకుండా  ఆరోగ్యానికి,అందానికి ఎంతో మేలు చేకూరుస్తుంది.

ఎర్ర కందిపప్పును ఆహారంలో మాత్రమే వినియోగించకుండా చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించే, పలు రకరకాల ఫేస్ ప్యాక్ లు కూడా తయారు చేసుకోవచ్చు. తద్వారా ఛర్మానికి పోషకాలు, ఖనిజాలు అంది ప్రయోజనం చేకూరుతుంది. ఎర్ర కందిపప్పు  మీ చర్మాన్ని శుభ్రపరిచి, పోషకాహారాన్ని అందించే సహజ సిద్ధమైన ఎక్స్ ఫోలియేట్ గా పనిచేస్తుంది . అయితే ముందుగా ఈ ఎర్ర కందిపప్పు ను ఉపయోగించి ఎలాంటి ఫేస్ మాస్కులు తయారు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇందుకోసం ఎర్ర కందిపప్పును నానబెట్టి, మెత్తగా రుబ్బి, అందులో కొన్ని పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి స్క్రబ్ లాగా అప్లై చేసి, ఆ తర్వాత 20 నిమిషాల పాటు  పూర్తిగా ఆరనివ్వాలి. ఇలా పూర్తిగా ఎండిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఈ ప్యాక్ మీ చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయడానికి, మృతకణాలు, కాలుష్య కారకాలను తొలగించడానికి సహాయపడుతుంది. ఈ ప్యాక్ ను క్రమం తప్పకుండా ఉపయోగిస్తే,చర్మం మచ్చ లేకుండా తయారవుతుంది.

చర్మం వదులుగా తయారయ్యి, వయసు పైబడినట్టు కనిపిస్తుంటే, ఇప్పుడు చెప్పబోయే ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది. ఇందుకోసం మసూర్ పప్పు పిండిలో గుడ్డు తెల్లసొనను కలపాలి. గుడ్డులోని ప్రోటీన్ల కారణంగా చర్మం తెల్లగా మారడమే కాకుండా, ముడతలు లేకుండా ఉంటుంది. ఈ ఫేస్ ప్యాక్ ను చర్మానికి సహజమైన రక్తస్రావ నివారిణిగా పనిచేస్తుంది.

ఒకవేళ చర్మం పొడిబారినట్లు అనిపిస్తే,  దానికి అదనపు తేమ అవసరం. కాబట్టి మసూర్ పప్పును మెత్తగా రుబ్బి అందులో కొన్ని చుక్కల వెనిగర్, నీటిని, తేనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తగినంత తేమ అంది,నిర్జీవ స్థితి నుంచి బయటపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: