వేపాకులతో వీటిని కలిపి రాయడం వల్ల ముఖం మీద మొటిమలు తగ్గుతాయట..!

Divya

వేపలో ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనకు తెలుసు. ఈ వేపాకు వల్ల  మీ అందాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. ఈ వేప చాలా చర్మ సమస్యలకు ఆయుర్వేద నివారణ. ఇది కేవలం చర్మానికే కాకుండా జుట్టుకు కూడా మంచి ఔషధంగా పనిచేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ తో పాటు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగిన వేప ఇప్పుడు అనేక సౌందర్య సాధనాలలో ఉపయోగించబడుతోంది. అయితే వేపలో వాటిని కలిపి ముఖంమీద రాయడం వల్ల ముఖం మీద మొటిమలు తగ్గించుకోవచ్చు..


తులసి తో పాటు వేపాకులకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ముఖవర్చస్సు ను కూడా పెంచుతుందని మనం గుర్తుంచుకోవాలి. వేపాకులను,తులసి ఆకులను మెత్తగా నూరి ముఖానికి పట్టించి ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ కు క్రిమినాశక లక్షణాలు గా పనిచేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ వల్ల మీకు నల్ల మచ్చలు,మొటిమలు,మచ్చలను తగ్గించడానికి సహాయపడడమే కాకుండా మెరుస్తున్న ఆరోగ్యవంతమైన చర్మాన్ని కూడా ఈ ప్యాక్ ఇస్తుంది.


అలాగే వేపాకు,పసుపు కలిపి మెత్తగా నూరి, ముఖానికి పట్టించడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. పసుపు కూడా యాంటి ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. కాబట్టి ముఖం మీద మొటిమలు మచ్చలు రాకుండా నివారించవచ్చు.

ఇక బొప్పాయి,వేపతో తయారుచేసిన ఫేస్ ప్యాక్ త్వరగా చర్మాన్ని పునరుజ్జీవింపచేయడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్యాక్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల  అందంగా మారడంతోపాటు ప్రకాశవంతంగా మారుతుంది. ఇందుకోసం రెండు టేబుల్ స్పూన్ల వేప పొడి, రెండు టేబుల్ స్పూన్ల బొప్పాయి గుజ్జు ఈ రెండింటినీ బాగా కలిపి ముఖం మీద పూయాలి. పది నుంచి పదిహేను నిమిషాలు ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది.

ఇక జిడ్డు చర్మం తో బాధపడుతున్న వారికి మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి మార్కెట్లో దొరికే పారిబీన్ ఫ్రీ కలిగిన నీమ్ ఫేస్ వాష్ ను తీసుకొచ్చి ఉపయోగించవచ్చు.  ఫలితంగా ముఖం మీద మచ్చలు,మొటిమలు తగ్గు ముఖం పడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: