ముఖాన్ని అందంగా మార్చడానికి ఐస్ క్యూబ్ పనికోస్తుందా..?

Divya

ప్రతి ఒక్కరికి తమ ముఖాన్ని మచ్చలు లేకుండా నున్నగా, ప్రకాశవంతంగా చూసుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అయితే ఇందుకోసం ఎన్నో రకాలుగా కష్టపడుతూ ఉంటారు. రేడియంట్ గా కనిపించాలని తహ తహ లాడుతూ వుంటారు. సూర్యుడు,ఒత్తిడి,కాలుష్యం తో పాటు అనారోగ్యకరమైన ఆహారం కూడా చర్మాన్ని ప్రభావితం చేస్తుంది . ఫలితంగా మొటిమలు, ముడతలు,పొడిబారిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే మీ ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి ఐస్ క్యూబ్ లను ఉపయోగించవచ్చు. ఐస్ క్యూబ్ లను ఉపయోగించడం వల్ల చర్మం సహజంగా అందంగా మారుతుంది.

ముఖంపై ఐస్ క్యూబ్ తో మసాజ్ చేయడం వల్ల రక్త నాళాలు సరిగ్గా రక్తాన్ని సరఫరా చేస్తాయి. ఇక ఎప్పుడైతే ముఖంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుందో,అప్పుడు  ఆటోమేటిగ్గా అందం పెరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు రోజుకు ఒకసారి ఐస్ క్యూబ్స్ తో మసాజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి.
ఒకవేళ మీరు మీ ముఖం మీద ఏదైనా బ్యూటీ క్రీములను రాసినప్పుడు, వాటిని త్వరగా మీ ముఖం గ్రహించాలంటే ఐస్ క్యూబ్ లతో మసాజ్ చేయడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల ముఖం మీద ఉన్న క్రీములు త్వరగా నిక్షిప్తం అవుతాయి.
అలాగే చాలా మందికి కళ్ళకింద నల్లటి వలయాలు ఏర్పడి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటి వారు ఐస్ క్యూబ్ తో కళ్ళకింద సున్నితంగా మసాజ్ చేయడం వల్ల, త్వరగా కళ్ల కింద ఉండే నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి ఈ ఐస్ క్యూబ్స్ ఎంతగానో దోహదం చేస్తాయి.
మీరు వేసుకునే మేకప్ ఎక్కువసేపు ఉండేలా ఈ ఐస్ ప్యాక్ బాగా పనిచేస్తుంది. మేకప్ వేసే ముందు ఐస్ క్యూబ్ లేదా ఐస్ ప్యాక్ వాడడం వల్ల మీ ముఖం మీద మేకప్ ఎక్కువ సేపు మేకప్ ఉంటుంది.

అలాగే పెదాలను మృదువుగా చేస్తుంది. మీ పెదాలు పొడిబారినట్టు అనిపిస్తే, ఐస్ క్యూబ్ తో సున్నితంగా మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల పగిలిన పెదాలు మృదువుగా మారతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: