వీటిని తింటే 40 సంవత్సరాలలో కూడా 20 సంవత్సరాలుగా కనిపిస్తారట..!

Divya

సాధారణంగా వయసు పెరిగే కొద్దీ, మన ముఖంలో ముడతలు, వృద్ధాప్య  ఛాయలు కనిపించడం సహజం  . కానీ అలా కనిపించడాన్ని ఎవరూ ఇష్టపడరు.. ఎవరికి వారు స్వీట్ సిక్స్టీన్ అని ఫీల్ అయి పోతూ ఉంటారు.. అలాంటి వారు 40 సంవత్సరాలు దాటినా కూడా ఎన్నో ఎక్సర్సైజులు,ఫుడ్ మెయింటెన్ చేస్తూ ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా కాపాడుకుంటూ వస్తున్నారు. ఇక మిగతా వారికోసం కూడా ఇప్పుడు చెప్పబోయే కొన్ని పండ్లను తింటే 40 సంవత్సరాలలో కూడా 20 సంవత్సరాలు ఉన్నట్టుగా కనిపిస్తారట..!అయితే ఆ పండ్లు ఏవేవో ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా చెప్పుకుంటూపోతే మనిషి జీవితం చాలా విచిత్రమైనది. పుట్టుకతో మొదలై, బాల్యం,కౌమారం,యవ్వనం, మధ్యవయసు, వృద్ధాప్యం ఆ తర్వాత మరణం ఇలా కొనసాగుతుంది.. అయితే బాల్యం, కౌమారం,యవ్వన దశలు చాలా హ్యాపీగా గడిచిపోతాయి. కానీ మధ్య వయస్సు వచ్చేటప్పటికి ఆరోగ్యం ముప్పుతిప్పలు పెడుతుంది. అయితే మనం 30 సంవత్సరాల వయసులో కూడా హ్యాపీగా ఉండాలంటే కొన్ని పండ్లను తీసుకోవాలి..
 బత్తాయి:
 అన్ని చోట్ల అందరికీ తక్కువ ధరలో,అందుబాటులో ఉండే పండు బత్తాయి. ఇందులో విటమిన్ బి పుష్కలంగా లభిస్తుంది. అలాగే ఫైబర్, జింక్, కాపర్,ఐరన్,క్యాల్షియం మొదలైన పోషకాలు బత్తాయిలో ఉంటాయి. అంతేకాకుండా వీటిలో క్యాలరీలు, ఫ్యాట్ శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి మధ్య వయస్సు కల వారు వీటిని జ్యూస్ రూపంలో కాకుండా నేరుగా తినడానికి ప్రయత్నించాలి..
మామిడి పండు :
వేసవికాలం అనగానే మామిడిపండు గుర్తుకు రావడం సహజం. మామిడి పండ్లలో ఫైబర్, విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. మామిడి పండ్లను తినడం వల్ల రేచీకటి, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు రాకుండా అరికట్టవచ్చు.
అరటిపండు :
అరటి పండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.అంతేకాకుండా క్యాల్షియం, విటమిన్ ఏ,విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ సి కూడా మెండుగా ఉంటాయి. అంతేకాకుండా జీర్ణ శక్తిని కూడా పెంచుతుంది. కాబట్టి అరటిపండు తినడం వల్ల ఆరోగ్యంగా అందంగా ఉండవచ్చు..
ఇక ఇవి మాత్రమే కాకుండా నేరేడు పండ్లు, నిమ్మరసం, ద్రాక్ష పండ్లు, జామకాయ, యాపిల్,  దానిమ్మ ఇవన్నీ కూడా మన జీవితానికి దీర్ఘాయుష్షును ప్రసాదిస్తుంది. వీటిని తినడం వల్ల మనం నిత్యయవ్వనంగా, నిత్యం ఆరోగ్యంగా వుండ గలుగుతాము...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: