ఆహారంతో మొటిమలకు చెక్..!
ముఖం అందంగా ఉండాలంటే ముఖం మీద ఎలాంటి మచ్చలు, మొటిమలు లేకుండా ఉంటేనే ముఖం అందంగా కనిపిస్తుంది. అందుకోసం మనలో చాలామంది పై పూతల కోసం ముఖం పైన మాత్రమే క్రీములు రాస్తూ వాటిని తొలగించుకోవాడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక ఆ ప్రయత్నంలో వారు బిజీగా ఉంటూ శరీరం లోపల నుంచి పోషణ అందిస్తేనే మొటిమలు తగ్గుతాయి అన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. అయితే అలాంటి వారి కోసమే ఇప్పుడు మీ ముందుకు మేము తీసుకొచ్చాం కొన్ని చిట్కాలు.. సరైన ఆహారం తీసుకోవడం వల్ల ముఖం మీద మొటిమలు రావడాన్ని తగ్గించవచ్చని అంటున్నారు సౌందర్య నిపుణులు. అయితే ఆ చిట్కాలేంటో చూసేద్దామా..
గ్రీన్ టీ :
ప్రతి ఒక్కరు గ్రీన్ టీ చర్మానికి ఎంతో మేలు చేస్తుందని నమ్ముతున్నారు. అందుకే చర్మ కాంతిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే మొటిమల సమస్య ఎక్కువగా ఉన్న వారు రోజూ రెండు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు బయటకు పోయి మొటిమల నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది.
టొమాటోలు:
టొమాటోలలో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉండడంవల్ల చర్మ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. అందుకోసం మనం తినే వంటలో ఎక్కువగా టొమాటోలను వాడడం వల్ల మొటిమల సమస్య నుంచి బయటపడవచ్చు..
ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు:
మనం తీసుకునే ఆహారంలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండేలా చూసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు మొటిమలను తగ్గించడంలోనూ సమర్థవంతంగా పని చేస్తాయి. చేపలు, ఆకుకూరలు,వాల్నట్స్, ఆలివ్ నూనె,గుడ్లు లాంటివి పుష్కలంగా తినాలి.
మంచినీళ్లు :
మంచినీళ్లు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి సహాయపడతాయి. ఎప్పుడైతే మన శరీరంలో నీటి శాతం తగ్గిపోతుందో, అప్పుడు క్రమంగా చర్మం పొడిబారిపోవడం, మొటిమలు రావడం జరుగుతుంది కాబట్టి శరీరానికి తగినన్ని నీటిని అందిస్తూ ఉండాలి. నీటిని ఎక్కువగా తాగలేమేమో అనుకునేవారు పండ్లరసాలను ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి..