స్నానానికి వాడే సబ్బు మంచిదో కాదో తెలుసుకోవడం ఎలా..?

Divya

అసలు సబ్బు లేనిదే స్నానం చేయడం కష్టం. ప్రస్తుతం మార్కెట్లో కి వినియోగదారులకు అనుకూలంగా ఎన్నో రకాల సబ్బులు విడుదలవుతున్నాయి. అందులోనూ రకరకాల పేర్లతో, రకరకాల రంగులతో, వివిధ రకాల ఆకారాలతో ఈ సబ్బులు ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా వీటినుంచి వచ్చే సువాసనలు వినియోగదారులను ఇట్టే మైమరిపింపచేస్తున్నాయి. ఇప్పట్లో అయితే మరీ ముఖ్యంగా చిన్న పిల్లలకు కోసం ప్రత్యేకంగా  సబ్బులు తయారు అవుతున్న విషయం తెలిసిందే.. అయితే మనం వాడుతున్న అన్ని సబ్బులు మన చర్మానికి తగినవేనా..లేదా.. అని ఎవరూ ఆలోచించడం లేదు. ఈ సబ్బులు మన చర్మాన్ని తెల్లగా మారుస్తాయో,లేదో,తెలియదు కానీ, చర్మంలోని తేమను మాత్రం పీల్చుకుంటాయి. అయితే  మనం వాడే సబ్బులు మంచివో..కాదో.. తెలుసుకోవాలి అంటే కొన్ని చిట్కాలను పాటించాలి అని అంటున్నారు నిపుణులు.. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


ముఖ్యంగా మనం ఏదైనా సబ్బు తీసుకోవాలి అనుకుంటే మొదటగా దాని ప్యాక్ పై ఉండే టీఎఫ్ఎం అనే పదాన్ని బాగా గమనించాల్సివుంటుంది. ఈ టీ ఎఫ్ ఎమ్ సబ్బు యొక్క  నాణ్యత ను నిర్ణయించడానికి ఉపయోగపడుతుంది. అయితే మీరు కూడా మీరు ఉపయోగించే సబ్బు మీద ఉన్న ప్యాకింగ్ పై ఈ టీ ఎఫ్ ఎమ్ ను గమనించవచ్చు. ఒకవేళ దానిపై 70 శాతం, 67 శాతం,82 శాతం అని ఉంటే,అది మంచి సబ్బు నాణ్యతను తెలియజేస్తుంది..


అయితే ముందుగా ఈ టీఎఫ్ఎమ్ గురించి తెలుసుకుందాం.. టీ అంటే టోటల్, ఎఫ్ అంటే ఫ్యాటీ,ఎం అంటే మేటర్ అని దీని అర్థం. ఈ టీఎఫ్ఎమ్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ సబ్బు అంత క్వాలిటీ గుణాలను కలిగి ఉంటుంది.. అయితే బీఐఎస్ ( భారతీయ ప్రమాణాల బ్యూరో ) ప్రకారం సబ్బులను మూడు రకాలుగా విభజించారు. అవి గ్రేడ్-1 గ్రేడ్-2 గ్రేడ్-3 గా విభజించబడ్డాయి. టీఎఫ్ఎం 75 శాతం కంటే ఎక్కువగా ఉంటే వాటిని గ్రేడ్-1 అని, 70 నుంచి 75 శాతం మధ్యలో టీఎఫ్ఎం ఉంటే అవి గ్రేడ్ 2 అని, 60 నుంచి 70 శాతం మధ్యలో టీఎఫ్ఎం ఉన్నవి గ్రేడ్ 3 గా వర్గీకరించారు. అయితే గ్రేడ్ 2,3 సబ్బులలో ఫిల్లర్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి  సబ్బు రూపంలో కలిసిపోయి ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతగానో హానికరం. కాబట్టి గ్రేడ్ వన్ సబ్బులు తీసుకోవడం ఉత్తమం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: