ఈ సింపుల్ టిప్స్ తో మీ ముఖాన్ని తెల్లగా మార్చుకోండి....
ఒక టీస్పూన్ పాలు, వాటర్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత ముఖం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.బొప్పాయిలో ఎంజైమ్స్ అధికంగా ఉండటం వల్ల చర్మం తెల్లగా మార్చుతుంది. దీంతో పాటు నేచురల్ సన్ స్క్రీన్ గా పనిచేస్తుంది. చర్మానికి సన్ టాన్ నుండి రక్షణ కల్పిస్తుంది. అరకప్పు బొప్పాయి ముక్కలను పేస్ట్ చేసి, ఒక టీస్పూన్ తేనెను మిక్స్ చేయాలి. ఈపేస్ట్ ను ముఖానికి అప్లై చేసి, 20 నిముషాల తర్వాత వాటర్ కడిగేసుకోవాలి.ఫ్రెష్ గా తరిగిన టమెటో ముక్కలను మెత్తగా పేస్ట్ చేసి, పెరుగు మిక్స్ చేసి, ముఖానికి ప్యాక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. చర్మంను తెల్లగా మార్చుతుంది.ఈ ఫేస్ మాస్క్ ను ప్రతి రెండు రోజులకొకసారి అప్లై చేయాలి. ఇలా చేస్తే మంచి ఫలితం పొందుతారు.
ఓట్స్ ఇంకా పెరుగు బెస్ట్ నేచురల్ పదార్థాలు. ముఖం తెల్లగా మార్చడంలో సహాయపడుతాయి. ఇది సన్ టాన్ తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది ఏజ్ స్పాట్స్, పిగ్మెంటేషన్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఓట్ మీల్ ను రాత్రంతా నానబెట్టి, ఉదయం మెత్తగా పేస్ట్ చేసి, పెరుగుతో కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి.ఒక టేబుల్ స్పూన్ పాలు, నిమ్మరసం, తేనె ఒక్కో టేబుల్ స్పూన్ తీసుకుని, మిక్స్ చేయాలి.ఇలా చేయడం వల్ల ఇది మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి కొద్ది సేపటి తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఖచ్చితంగా తెల్లగా మారడం ఖాయం.