ఆవిరితో సహజసిద్ధమైన అందం మీ సొంతం..!

Divya

ప్రతి ఒక అమ్మాయికి తను అందంగా, నలుగురిలో విభిన్నంగా కనిపించాలనే తపన ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే ఎన్నో రకాల క్రీములు, కాస్మెటిక్ లు వాడుతూ వారి అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి, ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇటీవల కాలంలో కరోనా వచ్చిన తర్వాత చాలామంది ఇంటి చిట్కాలకే పరిమితం అవుతున్నారు. మొదట్లో అయితే చాలా మంది బ్యూటీ పార్లర్ల చుట్టూ, సౌందర్య నిపుణుల చుట్టూ తిరుగుతూ, వేలకు వేలు ఖర్చు పెట్టుకునేవారు. ఫలితం అప్పటికప్పుడే వస్తుంది. కానీ తరువాత ఎన్నో సైడ్ ఎఫెక్ట్ లను ఎదుర్కోవాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు కూడా మీరు ఉపయోగించే చిట్కాలకు ముందు మీ ముఖానికి ఆవిరి పడితే,  ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అది ఎలానో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ముఖానికి ఆవిరి పట్టడం వల్ల చర్మ రంధ్రాలను తెరచుకొనేలా చేస్తుంది. ఇలా చేయడం వల్ల చర్మం లోపలి పొరల్లో పేరుకొన్న దుమ్ము, ధూళిని నిర్మూలించడానికి ఆవిరి సహాయపడుతుంది. ఫలితంగా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ను తొలగించడం సులభం అవుతుంది. ఆవిరి పట్టడం వల్ల మన ముఖంమీద రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఫలితంగా సహజమైన ఆరోగ్యకరమైన కాంతి మీ చర్మానికి సంతరించుకుంటుంది.

ఎప్పుడైతే చర్మానికి ఆవిరి పడతామో, అప్పుడు చర్మానికి తగినంత తేమ అందుతుంది. ఆవిరి పట్టే సమయంలో సరైన రక్త ప్రవాహం జరిగి కొల్లేజన్ మరియు ఎలాస్టిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. దీని ఫలితంగా చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.. అంతేకాకుండా ఆరోమాథెరపీ ద్వారా కూడా ఆవిరి పట్టవచ్చు. ఆవిరి పట్టేటప్పుడు సువాసనలను అందించే, నూనెను ఒక రెండు మూడు చుక్కలు నీటిలో వేస్తే,మనసు కూడా ఉల్లాసంగా మారుతుంది. అంతే కాకుండా సైనాస్ తో పాటు తరచూ వచ్చే తలనొప్పి నుండి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది.. కాబట్టి ఇంట్లోనే అతి తక్కువ సమయంలోనే ఆవిరి పట్టుకొని ముఖం అందంగా మారే లాగా ప్రయత్నించండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: