గులాబీ జలంతో ముఖవర్చస్సును ఎలా పెంచుకోవాలో తెలుసా..?

Divya

సాధారణంగా ముఖానికి ఉపయోగించే వివిధ రకాల కాస్మెటిక్స్, క్రీములలో గులాబీ నీళ్లు కూడా ఒకటి. అయితే మనలో చాలామంది ముఖానికి మేకప్ వేసుకునే ముందు టోనర్ గా ఈ గులాబీ నీళ్లను ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ గులాబీ నీళ్లను ముఖానికి వివిధ రకాల రూపంలో ఉపయోగించడం ముఖవర్చస్సు ను మరింత పెంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే ఈ గులాబీ నీళ్లను ఉపయోగించి మన ముఖాన్ని ఎలా నిగనిగలాడేలా చేసుకోవాలో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

గంధం పొడి ఒక టేబుల్ స్పూన్, పసుపు అర  టేబుల్ స్పూన్, రోజ్ వాటర్ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే, ముఖ ఛాయ మెరుగుపడుతుంది. ఎండకు నల్లగా మారిన చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది.
అంతేకాకుండా అర టేబుల్ స్పూన్ కీర రసంలో కొద్దిగా రోజ్ వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని కళ్ళకు రాసుకుని అరగంట సేపు ఉంచి, ఆ తర్వాత కడుక్కుంటే కళ్లు ఆకర్షణీయంగా తాజాగా కనిపిస్తాయి..

డైలీ గులాబీ నీళ్లను కళ్ళ చుట్టూ దూదితో అందుకని కాసేపు విశ్రమించండి. ఇలా చేస్తే  కళ్ళకు తాజాదనం అందడంతోపాటు  తాజాగా కంటిచూపుకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది.

ముల్తానీ మట్టి ఒక టేబుల్ స్పూన్, కొద్దిగా బంగాళదుంప గుజ్జు, అందులో నాలుగు చుక్కల రోజ్ వాటర్ కలిపి మెత్తటి మిశ్రమంలా తయారు చేయాలి.  ఈ మిశ్రమాన్ని ముఖానికి సమపాలల్లో అప్లై చేసి, ఆ తర్వాత పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే నిగనిగలాడే చర్మం మీ సొంతమవుతుంది.
టమాటా గుజ్జు ఒక టేబుల్ స్పూన్, పెరుగు ఒక టేబుల్ స్పూన్, రోజ్ వాటర్ ఒక టేబుల్ స్పూన్ ను గిన్నెలో వేసి బాగా కలిపి ముఖంమీద, మెడమీద రాసుకోవాలి.  పదిహేను నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.  మరొకసారి చల్లని నీళ్ళతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖానికి చల్లదనంతో పాటు తాజాగా మచ్చలు లెని ముఖం మీ సొంతమవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: