జుట్టు రాలే సమస్యను ఇలా కూడా అధిగమించవచ్చా..!
సాధారణంగా ప్రతి ఒక్కరి లో జుట్టు రాలే సమస్యను గమనిస్తూనే ఉంటాం.. అయితే ఈ జుట్టురాలే సమస్య నుంచి బయట పడాలంటే రకరకాల ప్రయత్నాలు కూడా చేసి ఉంటారు. అయితే ఈ ప్రయత్నాలన్నీ చేసి విఫలం అయి ఉంటారు. మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో మహిళలు, పురుషులనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఇది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. మొదట పలుచగా రాలుతున్నప్పుడు లైట్ తీసుకోవడం, ఆ తర్వాత తీవ్రత పెరిగితే బాధపడడం కామన్ అయిపోయింది. అయితే సాధారణంగా ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత జుట్టు రాలడం సాధారణం. కానీ చిన్న వయసులోనే జుట్టు రాలడం జరిగితే దానిపై ఎంతో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది..
అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని సహజ సిద్ధమైన పద్దతుల ద్వారా జుట్టురాలడాన్ని ఆపవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే ఆ రెమెడీ ని ఇప్పుడు మీరు కూడా ఒక సారి తెలుసుకోండి. సాధారణంగా కలబంద వల్ల మనుషులకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వీటి ఉపయోగాల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కలబంద, కొబ్బరి నూనె, ఉల్లిపాయ రసం మిక్స్ చేసి జుట్టుకు పూయడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు.
అయితే ఈ నూనెను ఎలా తయారు చేయాలి అంటే.. మొదటగా ఉల్లిపాయను మెత్తగా రుబ్బుకోవాలి. దీని నుంచి రసం తీసి,కలబంద పేస్ట్ లో కొబ్బరి నూనె, ఈ ఉల్లిపాయ రసం కలిపి బాగా మిశ్రమంలా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని రోజు జుట్టు మీద పూయాలి. తద్వారా మీ జుట్టు అందంగా, మందంగా, పొడవుగా, బలంగా కనిపిస్తుంది.
జుట్టు రాలడానికి ప్రధాన కారణాల్లో చుండ్రు కూడా ఒకటి. సరైన మొత్తంలో పోషకాలను మన శరీరానికి అందించకపోతే ఇతర సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి రోజువారి దినచర్యలో ఈ ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు రాలే సమస్య నుండి బయటపడవచ్చు. ఉల్లిపాయ రసానికి, తేనెను కూడా జోడించి, జుట్టు కుదుళ్లకు పట్టించడం వల్ల జుట్టు రాలే సమస్య నుండి బయటపడవచ్చు.