అందాల భామల సౌందర్య రహస్యం ఏమిటో తెలుసా..?
పర్షియా దేశస్తుల భామల సొగసు చూడ తరమా..! అనడంలో ఎలాంటి సందేహం లేదు .. అంటే వారి అందానికి పరవశించని హృదయం ఉండదు.. అలాగే ఆ ముద్ద మనోహర మోముకు మైమరచిపోని మనిషి ఉండడు.. గోధుమరంగు మేని ఛాయతో.. నీలి కళ్ళతో.. ఒత్తయిన జాలువారు కురులతో అందానికి పర్యాయపదంగా మెరిసిపోతున్నారు ఈ బొమ్మలు లాంటి భామలు.. ఇంతకీ ఏంటి వీరి అందం.. వీరి అందం వెనుక ఉన్న రహస్యం ఏమిటి.. ఇంతటి అపురూపమైన లావణ్యం వారికెలా సొంతమైంది.. అనే ఆలోచనలతో కొంతమంది సతమతమవుతూ ఉంటారు.. అయితే వీరు ఉపయోగించే పద్ధతులు కూడా వినడానికి చాలా సింపుల్ గా ఉన్నా..చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.. అయితే ఈ భామలు ఉపయోగించే సౌందర్య రహస్యాలు ఏమిటో మనం కూడా తెలుసుకుందాం..
పాలతో స్నానం..ఇదేంటి ఇక్కడ తాగాడానికి కూడా పాలకు దిక్కు లేదంటే.. ఇక స్నానానికి కూడానా.. అని ఆలోచిస్తున్నారు మన వాళ్ళు.. నిజంగా నిజమండి.. పర్షియాలో ఆడవాళ్ళు పాల తోనే స్నానం చేస్తారట.. దానిని మిల్క్ బాత్ అని అంటారు.. వారు స్నానం చేసే పది నిమిషాల ముందు నీళ్ళలో కొన్ని పాలు కలిపి, కొద్దిసేపు ఆగిన తర్వాత తిరిగి స్నానం చేస్తారు. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల మేని ఛాయ మెరుగుపడుతుంది. ఇక అంతే కాదు బాత్ టబ్ లో స్నానం చేసేటప్పుడు అప్పుడప్పుడు గోరువెచ్చని నీటిని నింపి, ఆలివ్ ఆయిల్,బాదం ఆయిల్ లేదా కొబ్బరి నూనె ఇలా, వీటిలో ఏదో ఒకటి కొన్ని చుక్కలు బాత్ టబ్ లో వేసుకొని బాగా కలుపుకొని స్నానం చేయాలి .. ఇలా స్నానం చేయడం వల్ల చర్మం సహజతేమను కోల్పోకుండా ఉంటుంది.
అలాగే చర్మం మీద ఉండే మృతకణాలను తొలగించుకోవడం కోసం వారు స్నానం చేసే నీటిలో సముద్రపు ఉప్పును కూడా కలుపుతారట..ఇది చర్మానికి స్క్రబ్లా పనిచేసి, చర్మం సుతిమెత్తగా మారేలా చేస్తుంది.. అందుకే ఈ పద్ధతులను పర్షియా భామలు అతి జాగ్రత్తగా ప్రతిరోజు నిత్యం తప్పకుండా చేస్తారట..