పిగ్మెంటేషన్ ఎన్ని రకాలు..? దానిని ఎలా నివారించుకోవాలో తెలుసా..?
ప్రధానంగా పిగ్మెంటేషన్ మూడు రకాలు. అందులో ఒకటి హైపర్ పిగ్మెంటేషన్, హైపో పిగ్మెంటేషన్, డీ పిగ్మెంటేషన్. ముందుగా హైపర్ పిగ్మెంటేషన్ అంటే ఇది వచ్చినప్పుడు చర్మం ముదురు రంగులోకి మారిపోతుంది. ఇక హైపో పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు చర్మంపై అక్కడక్కడ మచ్చలు పడిపోతాయి. ఇక డీ పిగ్మెంటేషన్ వచ్చినప్పుడు చర్మం పూర్తిగా రంగు మారుతుంది. అయితే ఇటీవల కాలంలో చాలా మంది యువత హైపర్ పిగ్మెంటేషన్ సమస్యతో బాధపడుతున్నారు.. ఇందుకు కారణం శరీరంలోని మెలనిన్ అనే పదార్థం ఎక్కువైపోయి, ఒకేచోట పేరుకుపోతే ఈ పరిస్థితికి దారితీసి, మచ్చలు ఏర్పడతాయి..
అయితే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, ఉల్లిపాయ రసం ఆపిల్ గుజ్జును మిక్స్ చేసి మచ్చలపై అప్లై చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. ఆ తర్వాత స్ట్రాబెర్రీలను పేస్టులా చేసి, ముఖంపై మచ్చలకు పట్టించి, ఒక 30 నిమిషాల పాటు ఆరనిచ్చి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే, క్రమంగా ఈ మచ్చలు తగ్గడాన్ని గమనించవచ్చు..
ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, కొద్దిగా గంధం మిక్స్ చేసి, ఆ మిశ్రమాన్ని మచ్చలపై అప్లై చేయాలి. ఒక ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి, చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఇలా వారానికి రెండు నుండి మూడు సార్లు చేస్తే మంచి రిజల్ట్ కనిపిస్తుంది.
అలాగే ఎండబెట్టిన నారింజ తొక్కలను పౌడర్ చేసుకొని, ఒక రెండు టేబుల్ స్పూన్ల పౌడర్ ను తీసుకొని, నీళ్లల్లో కలిపి మచ్చలపై అప్లై చేసి కొద్ది సేపు ఆరనిచ్చి, ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సత్ఫలితాలను పొందవచ్చు.
బొప్పాయి గుజ్జు, అలోవెరా జెల్ ను ఒక గిన్నెలో వేసి బాగా మిక్స్ చేసి, దానికి ఓట్స్ పౌడర్ ను కలపండి. ఇక ఈ మిశ్రమాన్ని ముఖంపై మచ్చలున్న చోట అప్లై చేసి, నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మచ్చలు తగ్గిపోవడమే కాకుండా చర్మం మెరుస్తూ ఉంటుంది..