నల్లని మెడ తెల్లగా మారే అద్భుత చిట్కాలు...

Purushottham Vinay


సాధారణంగా చాలా మందికి కూడా ముఖం తెల్లగా ఉండి మెడ నల్లగా ఉంటుంది. అలా మెడ నలుపు తగ్గి తెల్లగా అవ్వడానికి ఈ చిట్కాలు పాటించండి.కాటన్ తీసుకొని నిమ్మరసంలో ముంచి మెడ మీద నల్లగా ఉన్న దగ్గర రాయండి. మీది మీది మెత్తని చర్మం అయితే నిమ్మ రసాన్ని నీటితో డైల్యూట్ చేసి వాడండి. ఇరవై నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయండి. అయితే, ఇలా చేసిన తరువాత సన్ లైట్ లోకి వెళ్ళకూడదు అని గుర్తు పెట్టుకోండి. మీరు ఇంకొక పని కూడా చేయవచ్చు. నిమ్మ రసం, రోజ్ వాటర్ సమాన భాగాలుగా తీసుకుని ఈ మిశ్రమాన్ని రాత్రి నిద్రకి ముందు మెడ మీద అప్లై చేయండి. ఇలా కనీసం ఒక నెల రోజుల పాటు చేస్తే ఫలితాలు కనబడతాయి.నిమ్మ రసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ నాచురల్ బ్లీచింగ్ ఏజెంట్ లాగా పని చేస్తుంది. అంతే కాక, నిమ్మ కాయలో ఉండే విటమిన్ సీ డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించేసి స్కిన్ టోన్ ని పెంచుతుంది.


కలబంద నుండి తాజాగా జెల్‌ని తీయండి. ఈ జెల్ ని డైరెక్ట్ గా మెడకి అప్లై చేసి మృదువుగా మసాజ్ చేయండి. ఆ తరువాత ఇరవై నిమిషాలు వదిలేయండి. నీటితో కడిగేయండి. రోజుకి ఒకసారి ఇలా చేస్తే మంచి ఫలితాలు కనబడతాయి.అలోవెరా సహజంగానే చర్మాన్ని మంచి రంగుని ఇస్తుంది.చర్మం మీద ఉండే రకరకాల నల్లటి మచ్చలని కూడా ఇది తొలగిస్తుంది.ఇక కీరా రసం కానీ, తురిమిన కీరా కానీ మీ మెడ మీద అప్లై చేసి పది నిమిషాల పాటు మృదువుగా స్క్రబ్ చేయండి. ఆ తరువాత చల్లని నీటితో కానీ, రోజ్ వాటర్ తో కానీ కడిగేయండి. అలాగే, కీరా రసం, నిమ్మ రసం సమాన భాగాలుగా తీసుకుని కాటన్ బాల్స్ సహాయంతో మెడ మీద అప్లై చేయండి.పది నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయండి.


కీరా స్కిన్ సెల్స్‌ని బాగా సరి చేస్తుంది, డెడ్ స్కిన్ సెల్స్‌ని తొలగిస్తుంది.కమలా పండు తొక్కల్ని ఎండలో పెట్టి ఎండిన తరువాత వాటిని పొడి చేయండి. ఈ పొడి, హోల్ మిల్క్ సమానభాగాలుగా తీసుకుని పేస్ట్ చేయండి. ఈ పేస్ట్ ని మెడకి అప్లై చేసి ఆరాక చల్లని నీటితో కడిగేయండి. అలాగే, కమలా పండు తొక్కల్ని తురిమి ఆ తురుముకి కమలాపండు రసం కలిపి ఆ మిశ్రమాన్ని మెడకి అప్లై చేయండి. పది నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయండి. ఇంకా చర్మానికి మంచి మెరుపునిస్తుంది.






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: