శరీర దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా... ?
*ముందుగా అటువంటి వారు శరీరంపై అవాంఛిత రోమాలను ఎప్పటికప్పుడు పెరగకుండా తొలగించుకుంటూ ఉండాలి.
*టీ మరియు కాఫీలు శరీరం నుండి ఎక్కువ చెమట ఉత్పత్తి అవడానికి ముఖ్య కారకాలు ముందుగా కాఫీ. కావున కాఫీని తరచూ తాగడం మానేయండి.
*స్నానం చేయాలనుకునే నీటిలో కొద్దిగా పుదీనా వేసి బాగా మరిగించి ఆ నీటితో స్నానం చేయడం ద్వారా చర్మం ఎక్కువ సేపు తాజాగా ఉండి, దుర్వాసన రాకుండా కాపాడుతుంది. ఇది చర్మ సౌందర్యానికి కి కూడా బాగా ఉపయోగపడుతుంది.
*స్నానం చేసే బకిటెడు నీటిలో ఒక టేబుల్ స్పూన్ వరకు తేనెను తీసుకుని బాగా కలపాలి, ఆ తేనె కలిపినటువంటి నీటితో స్నానం చేస్తే ...అంత ఈజీగా చెమట పట్టదు. ఎక్కువ సేపు చెమట పట్టకుండా ఉంటుంది. ఒకవేళ చెమట పట్టిన అంతగా దుర్వాసన రాకుండా ఉంటుంది.
పై చిట్కాలను పాటించడం వలన చెమట నుండి అలాగే దానివల్ల కలిగే దుర్వాసన నుండి ఉపశమనం పొందవచ్చు. అలాగే మంచి సువాసన విరజల్లే పౌడర్లను కూడా వాడండి.