పొట్టతో ఇబ్బంది పడుతున్నారా ?

VAMSI
అందంగా కనిపించాలని అందరి దృష్టి తమపై ఉండాలని ఎవరికి మాత్రం అనిపించదు. ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలనే ఆశపడతారు. ఒకరు అందంగా కనిపించాలంటే రంగుతో పాటు వారి శరీర ఆకృతి కూడా చాలా ముఖ్యం. చూడటానికి సన్నగా, నాజూగ్గా కనిపిస్తేనే బాగున్నారు అనే ఆలోచన వస్తుంది. లావుగానో, పెద్ద పొట్ట వేసుకుని ఉంటే పెద్దగా అందంగా కనిపించము. చాలా మంది తమ పొట్ట రోజురోజుకు పెరిగిపోతోంది అని తెగ బాధపడుతుంటారు. దీనికి ప్రధాన కారణం భారీగా మారిన మన జీవన శైలి. గతంలోలా శారీరక శ్రమ పెద్దగా లేకపోవడమే అలాగే మనం తింటున్న ఫాస్ట్ ఫుడ్స్. బెల్లీ ను తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు డైటింగ్ లంటూ ఏ బ్రెడ్డు ముక్కో తిని సరిపెడుతుంటారు. చపాతీలు అంటూ చలాకీగా తినేస్తుంటారు.
ఇలా ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా కొందరి బెల్లీ ఫ్యాట్ ఏమాత్రం తగ్గదు అలాంటి వారికి ఈ చిట్కాలు బాగా పనిచేస్తాయి. ఒకసారి ఫాలో అయ్యి చూడండి రిజల్ట్ మీకే కనిపిస్తుంది.  శరీర బరువును తగ్గించుకోవడంలో నిమ్మకాయ పాత్ర విశిష్టమనే చెప్పాలి. నిమ్మలో అధికంగా ఉండే విటమిన్ సి శరీర బరువు తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.  ప్రతి రోజు ఉదయాన్నే గోరు వెచ్చటి నీటిలో అర చెక్క నిమ్మ రసాన్ని తీసుకుని అందులో ఒక టీ స్పూను తేనెను కలిపి ఆ జ్యూస్ ను తాగాలి. ఇది మన బెల్లీని అలానే బరువుని తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.
* బరువు తగ్గాలంటే శరీరంలో పేరుకున్నకొవ్వును కరిగించాలి. అందుకు ముఖ్యంగా రోజుకి కనీసం పది గ్రాముల వరకు ఫైబర్ శరీరానికి అవసరమౌతుంది. ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలైన ముల్లంగి, పుచ్చకాయ, దోసకాయ, యాపిల్, చిలగడదుంప, టొమాటో, క్యాబేజీ, బీన్స్, అటుకులు, పొట్టు తీయని తృణధాన్యములు, పప్పుధాన్యాలు నిత్యం మన ఆహార పదార్థాలలో ఉండేలా చూసుకోవాలి. ఇవి శరీరంలోని కొవ్వును అదుపులో ఉంచుతాయి. ఫైబర్ ని ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి నీళ్ళు కూడా ఎక్కువుగా తాగాల్సి ఉంటుంది. రోజుకి 8-10 గ్లాసుల వరకు నీరు తాగాలి.
*సైక్లింగ్ చేయడం ద్వారా కూడా పొట్టను తగ్గించడానికి ఒక మంచి ఎక్సర్సైజ్. రోజూ కనీసం 20 నిమిషాలు అయినా సైక్లింగ్ చేయాలి. పొట్ట తగ్గడానికి ఆహార పదార్థాలను లిమిటెడ్ గా తీసుకోవడం ఎంత ముఖ్యమో అలాగే రెగ్యులర్ గా వ్యాయామం చేయడం కూడా అంతే అవసరం అన్న విషయం గుర్తుంచుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: