మీ ముఖం నల్లగా ఉందా... నలుగురిలోకి వెళ్లాలంటే ఇబ్బందా?
చాలా మంది చిన్న పిల్లలకు కొబ్బరి నూనెను రాసి కాసేపయ్యాక స్నానం చేయిస్తూ ఉంటారు. ఎందుకంటే వారి చర్మంలోని తేమ పోయి పొడిబారకుండా ఉండడానికి, అలాగే జ్ఞానం మెరుగుపడుతుందని, ఇక్కడ మరొక కారణం ఏమిటంటే నూనెతో శరీరంపై బాగా మసాజ్ చేయడం ద్వారా పిల్లల శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. అయితే పెద్ద వారికి కూడా ఈ కొబ్బరినూనె అందంగా కనిపించడానికి భలేగా ఉపయోగపడుతుంది. మీ ముఖంపై ఏమైనా మచ్చలు కానీ ఉన్నప్పుడు ఆ ముఖం ఆకర్షణీయంగా కనిపించకపోవచ్చు. ఇప్పుడు ఆ మచ్చలపై కొబ్బరి నూనె రాసి అలా ఓ అరగంట ఆగి శుభ్రం చేసుకోవాలి. ఇది ఒక మాయిశ్చరైజర్ లా బాగా పని చేయడమే కాకుండా చర్మం మంచి రంగులోకి రావడానికి ఉపయోగపడుతుంది.
*అలాగే ఎండబెట్టిన నారింజ తొక్కలను మెత్తటి పొడిలా చేసుకొని స్టోర్ చేసుకోవాలి. వారానికి మూడు సార్లు ఒక టీ స్పూన్ పౌడర్ లో కొద్దిగా పెరుగు వేసుకుని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించాలి. ఒక పదిహేను నిమిషాలు తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖంపై మచ్చలు పోవడమే కాదు ముఖం తెల్లగా కాంతివంతంగా కూడా తయారవుతుంది.
మరి ఈ రెండు చిట్కాలను వాడి మీ ముఖాన్ని తెల్లగా మరియు అందంగా మార్చుకోండి.