వృద్ధాప్య ఛాయలను దూరం చేసే చక్కని చిట్కా..!!

Divya
సాధారణంగా 30 సంవత్సరాలు దాటిన తర్వాత అటు అమ్మాయి అయినా సరే ఇటు అబ్బాయి అయినా సరే ముఖంలో మార్పులు రావడం మనం గమనించవచ్చు. వయసు పెరుగుతున్న కొద్దీ ముఖంలో వృద్ధాప్య ఛాయలు అలుముకుంటాయి. ఇకపోతే వృద్ధాప్య ఛాయలు రావడం వల్ల మనం మరింత వయసైన వారిలా కనిపిస్తూ ఉండడం సహజం. కానీ ఇలాంటి ముఖాన్ని అమ్మాయిలు స్వీకరించడానికి అస్సలు ఇష్టపడరు. ఎప్పటికప్పుడు ముఖాన్ని తేజోవంతం చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నట్లుగానే ముఖం మీద వచ్చే వృద్ధాప్య ఛాయలు దూరం చేసుకోవడానికి వారు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. అయితే ఈ వృద్ధాప్య ఛాయలను దూరం చేసే చిట్కాల గురించి మనం ఒకసారి చదివి తెలుసుకుందామ్..

తులసి ఆకులు:
తులసి ఆకులు ఆరోగ్యానికి ఎంత ప్రయోజనాన్ని అందిస్తాయో అందరికీ తెలిసిన విషయమే.అయితే ఈ తులసి ఆకులను నానబెట్టి మెత్తగా నూరి కొద్దిగా శెనగపిండి, తేనె వేసి మిశ్రమంలా చేయాలి. ఆ తర్వాత ముఖానికి అప్లై చేసి పూర్తిగా ఆరిన తర్వాత శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం మీద ఉండే మచ్చలు , మొటిమలు తొలగిపోవడంతో పాటు వృద్ధాప్య ఛాయలు కూడా దూరమవుతాయి.
అల్లం:
వృద్ధాప్య ఛాయలను రానివ్వకుండా చర్మాన్ని తేజోవంతం గా చేసే గుణం అల్లం కి ఉంటుంది. అల్లంలో యాంటీబ్యాక్టీరియల్ తో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడం వల్ల ముఖం చక్కగా కనిపిస్తుంది. ఇందుకోసం మీరు చిన్న అల్లం ముక్క తీసుకుని.. మెత్తగా దంచి అందులో కొద్దిగా బ్రౌన్ షుగర్, ఆలివ్ ఆయిల్ వేసి ముఖానికి అప్లై చేయాలి. సుమారుగా 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
పసుపు:
పసుపు క్రిమిసంహారిణి అని అందరికీ తెలిసిందే . ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ కారణంగా చర్మం మృదువుగా తయారవడానికి సహాయపడుతుంది. కాబట్టి పసుపు కూడా వారంలో రెండుసార్లు ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం మీద వచ్చి తేలికపాటి  వెంట్రుకలు దూరం అవడంతో పాటు వృద్ధాప్య ఛాయలు కూడా దూరమవుతాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: