వావ్:చింత పండుతో ఫేస్ వాష్..సూపర్..!!

Divya
ఎక్కడైనా నలుగురులో ఉన్నామంటే అందంగా కనిపించాలని తహతహ లాడుతున్నారు ప్రతి ఒక్కరు. ఇందుకోసం బయట దొరికే మార్కెట్ కొన్నిటిని మాయిశ్చరైజర్ , ఫేస్ మాస్కులు, స్క్రబ్ వంటివి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.ఇందులో ఎక్కువగా ఉండే గాఢత వల్ల చర్మం దెబ్బతింటుందని కొంతమంది వైద్యులు తెలియజేస్తున్నారు. దీని ఫలితంగానే మొటిమలు, ముడతలు, మచ్చలు వంటివి ఏర్పడతాయట. అందుకోసమే బయట దొరికే అటువంటి కొన్ని ప్రాజెక్టులను వాడకుండా.. ఇంట్లో తయారు చేసుకొనే వాటిని ఉపయోగించి వారు మంచిదని కొంతమంది నిపుణులు తెలియజేయడం జరుగుతోంది..
మన ఇంట్లో దొరికే చింతపండు ఫేస్ వాష్ వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. చింతపండులో ఎక్కువ పోషకాలు ఉండటం వల్ల ఇది చర్మ సౌందర్యాన్ని పెంపొందించడానికి బాగా సహాయపడుతాయి. దుమ్ములో తిరిగినప్పుడు చర్మ కణాల మీద పేరుకుపోయిన మురికిని శుభ్రం చేయడానికి, చర్మంపై మచ్చలు వంటి వలయాలు ఉన్నప్పుడు తొలగించడానికి బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా చింతపండు మాస్క్ వల్ల చర్మం మీద ఎటువంటి దుమ్ము పడినప్పటికీ కణాలు, మొటిమలు వంటివి ఏర్పడకుండా చేస్తాయి.. దీంతో చర్మం చాలా మృదువుగా మారుతుంది. ముఖ్యంగా వృద్ధాప్య ఛాయలు రాకుండా చింతపండు ఫేస్ మాస్క్ చర్మాన్ని కాపాడుతూ ఉంటుంది. అయితే దీనిని ఎలా తయారు చేయాలో చూద్దాం.
ముందుగా కాస్త చింతపండు గుజ్జు తీసుకుని.. అందులోకి ఒక స్పూన్ రోజ్ వాటర్, ఒక స్పూన్ ఆవు నెయ్యి, ఒక స్పూన్ తేనె.. ఒక స్పూన్ జోజోబా ఆయిల్ అన్ని తీసుకుని బాగా కలపాలి. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని ఒక రెండు గంటల సేపు నిల్వ ఉంచి.. దానిని చేతివేళ్ళతో తీసుకొని ముఖానికి సున్నితంగా పూయాలి.. ఇలా చేసిన ఐదు నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా వారంలో కనీసం రెండు సార్లు అయినా చేస్తే మీ చర్మం మృదువుగా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: