చర్మం పై మొటిమల కారణంగా మెరుపు తగ్గిపోయిందా..?

Divya
ఈ శీతాకాలం ఎక్కువగా చర్మాన్ని సంరక్షించుకోవాల్సి ఉంటుంది.ఇక చాలామందికి బయట వాతావరణం ఆహ్లాదంగా అనిపించినా చర్మంలో వచ్చే మార్పులను చూసి తట్టుకోలేక పోతున్నారు. అందుకే చర్మ సంరక్షణ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది.. చర్మ సంరక్షణలో పోషణ అనేది చాలా అవసరం.. అంతే కాదు చలికాలంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి.. లేకపోతే నష్టం కలుగుతుంది.. ముఖ్యంగా చర్మానికి అంతర్గతంగా ఎంత ప్రాధాన్యత ఇస్తామో బాహ్యంగా కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి..
ఇకపోతే చర్మంమీద సహజంగా ఈ శీతాకాలంలో ఎదురయ్యే సమస్య ఏమిటంటే.. చర్మం పగలడం లేదా పొడిబారిపోవడం.. దురద రావడం.. వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక అందుకే సాధ్యమైనంత వరకు చర్మాన్ని మృదువుగా.. తేమగా ఉంచుకోవడమే మంచిది అని సౌందర్యనిపుణులు కూడా చెబుతున్నారు. అయితే చాలా మందికి ముఖం మీద మొటిమలు వచ్చి మొటిమల కారణంగా ముఖంలో మెరుపు పోయి చాలా అంద విహీనంగా కనిపిస్తూ ఉంటారు.
ఇందుకోసం మీరు చేయవలసింది ఏమిటంటే ముల్లంగిని ఉపయోగించడం.. మనకు మార్కెట్లో దొరికే ముల్లంగితో విటమిన్లు, ఖనిజలవణాలు తగిన మోతాదులో లభిస్తాయి . ఇది ఆరోగ్యాన్నే కాదు అందాన్ని కూడా కాపాడుతుంది కాబట్టి ముల్లంగిని తప్పకుండా ముఖానికి అప్లై చేయాలి.. అయితే మృతకణాలను, మొటిమలను దూరం చేసే ఈ ముల్లంగి ని ఎలా ఉపయోగించాలి అంటే ముందుగా ముల్లంగిని తరగాలి.. ఇప్పుడు తరిగిన ముల్లంగి ఒక టేబుల్ స్పూన్ తీసుకుని అందుకు ఆఫ్ టేబుల్ స్పూన్ పెరుగు,  5 చుక్కల బాదం నూనె కలిపి పూర్తిగా మిశ్రమంలా చేయాలి.
దీనిని ముఖానికి, మెడకు ఒక లేపనంగా పట్టించి పావు గంట అలాగే వదిలేయాలి.. ఇప్పుడు చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ముఖ చర్మం తేమగా మారడంతోపాటు కాంతివంతంగా కూడా తయారవుతుంది. ముల్లంగిని తురమలేము అనుకునేవాళ్లు ముల్లంగి ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, కొద్దిగా నీళ్ళు పోసి మిక్సీలో పేస్టులా చేసుకుని ముఖానికి మునివేళ్లతో మృదువుగా రుద్దాలి.. ఇక ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమలు దూరం కావడంతో పాటు నిగారింపు కూడా వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: