ముడతలు, మొటిమలు తగ్గాలంటే ఈ నూనెను వాడాల్సిందే!

Purushottham Vinay
బాదం నూనెతో ముఖంపై ముడతల సమస్యకి చెక్ పెట్టవచ్చు. ఇందులో పోషకాలు చాలా సమృద్ధిగా ఉంటాయి.ఈ నూనె ముఖానికి సంబంధించిన అన్ని సమస్యలను కూడా తొలగిస్తుంది. దీన్ని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల అనేక చర్మ సమస్యలని ఈజీగా తగ్గించుకోవచ్చు. ముఖాన్ని ఎంతో కాంతివంతంగా తయారుచేసుకోవచ్చు.ఆల్మండ్ ఆయిల్ వాడటం వల్ల చర్మంపై పాత మచ్చలు తగ్గుతాయి. అంతేకాకుండా చర్మ రంధ్రాలు ఓపెన్ కూడా అవుతాయి. దీని కారణంగా ఆక్సిజన్ అనేది కణాలకు బాగా చేరుకుంటుంది. విటమిన్ ఎ ఇంకా విటమిన్ ఈ, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అలాగే జింక్ వంటి కొన్ని ప్రత్యేక పోషకాలు బాదం నూనెలో ఉంటాయి. ఇవి చర్మాన్ని చాలా మృదువుగా ఇంకా మెరిసేలా చేస్తుంది. దీంతో పాటు అనేక రకాల చర్మ సంబంధిత సమస్యలను తొలగించడంలో ఎంతగానో సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు కాటన్‌లో కొన్ని చుక్కల బాదం నూనె వేసి ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి.అలాగే ముఖం మీద మొటిమలు సమస్యతో ఇబ్బంది పడే వారు చర్మ సంరక్షణలో భాగంగా బాదం నూనెను ఉపయోగించాలి.


ఇందులో ఉండే యాంటీ-ఆక్సిడెంట్ ఇంకా యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్ మొటిమలను తొలగించడంలో బాగా సహాయపడతాయి. చాలా సార్లు నిద్ర లేకపోవడం ఇంకా అలాగే ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడుతాయి. ఈ పరిస్థితుల్లో రాత్రి పడుకునే ముందు బాదం నూనెలో కొద్దిగా రోజ్ వాటర్ లేదా తేనె కలిపి రాసుకుంటే నల్లటి వలయాలను ఈజీగా దూరం చేసుకోవచ్చు.ముఖంపై ముడతలు అనేవి వృద్ధాప్య లక్షణం. కాబట్టి బాదం నూనెలో కొబ్బరి నూనె ఇంకా అలాగే అలోవెరా జెల్‌ని కలిపి అప్లై చేయడం ద్వారా ముడతలని చాలా ఈజీగా తొలగించవచ్చు. ప్రతిరోజూ కూడా రాత్రి పడుకునే ముందు బాదం నూనెను చర్మానికి మీరు రాసుకోవచ్చు. ముందుగా ముఖాన్ని బాగా కడిగి ఆరిన తర్వాత అరచేతులపై కొన్ని చుక్కల బాదం నూనెను వేసుకొని ముఖానికి బాగా పట్టించాలి.ఆ తరువాత తేలికపాటి మసాజ్ ని చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: