చింతపండు: ఇలా చేస్తే మొటిమలు, మచ్చలు మాయం?

Purushottham Vinay
వంటకాలకు మంచి పుల్లపుల్లటి రుచిని అందించే చింతపండు.. సౌందర్య పోషణలో కూడా బాగా ఉపయోగపడుతుందన్న విషయం చాలామందికి తెలిసుండదు. కానీ మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్యల్ని తగ్గించడం ఇంకా అలాగే ముఖ కాంతిని పెంచే దాకా.. ఇలా అణువణువూ అందాన్ని ఇనుమడింపజేసే శక్తి దీని సొంతం అంటున్నారు సౌందర్య నిపుణులు. ఈ క్రమంలో చింతపండుతో ఇంట్లోనే తయారుచేసుకొనే కొన్ని ఫేస్‌ప్యాక్స్‌ ఏంటో తెలుసుకుందాం ..నిమ్మకాయంత పరిమాణంలో చింతపండును తీసుకొని దాన్ని పావుకప్పు వేడినీటిలో వేసి కాసేపు నాననివ్వాలి. ఆపై దీన్నుంచి పిప్పిని వేరుచేయాలి. ఇందులోంచి టేబుల్ స్పూన్ పరిమాణంలో గుజ్జును తీసుకోవాలి. దీనికి ఒక చెంచా ముల్తానీ మట్టి, కొద్దిగా రోజ్‌వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి, మెడకు మాస్క్‌లా వేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒకేసారి ఎక్కువ మొత్తంలో చేసుకొని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు. ఈ ఫేస్‌ప్యాక్ తరచుగా వేసుకుంటూ ఉంటే మొటిమల సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. అంతేకాకుండా చర్మం కొత్త మెరుపును కూడా సంతరించుకుంటుంది.


కొద్దిగా చింతపండును తీసుకొని సరిపడినన్ని నీళ్లు పోసి కాసేపు అలాగే వేడిచేయాలి.చల్లారిన తర్వాత చింతపండు నుంచి గుజ్జును వేరుచేయాలి. టేబుల్‌స్పూన్ గుజ్జును తీసుకొని దానికి అరచెంచా పసుపుని కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకొని ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ మీ చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది.అలాగే కొద్దిగా చింతపండును తీసుకొని పావుగంట పాటు వేడినీటిలో నానబెట్టాలి. తర్వాత చింతపండును మెత్తగా పిసికి పిప్పిని వేరుచేయాలి. ఈ చింతపండు గుజ్జుకు అరటిపండు గుజ్జు, శెనగపిండిని జతచేసి పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిని చర్మానికి పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఈ మిశ్రమం బ్లీచింగ్ ఏజెంట్‌లా పనిచేసి చర్మాన్ని బాగా శుభ్రం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: