పెదాలు గులాబీ రంగులో మృదువుగా వుండే టిప్స్?

Purushottham Vinay
చాలా మందికి కూడా పెదాలు పగిలిపోయి నల్లగా ఉంటాయి. అలా లేకుండా మన పెదాలు గులాబీ రంగులో మెరిసిపోతూ ఉంటే చూడటానికి చాలా బాగుంటాయి.అయితే ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం, వాతావరణంలో వచ్చే మార్పులు, మృత కణాలు, శరీరంలో అధిక వేడి ప్రభావం ఇంకా అలాగే కెమికల్స్ ఎక్కువగా ఉండే లిప్ స్టిక్ వాడటం వంటి అనేక రకాల కారణాలతో పెదాలు నల్లగా మారుతూ ఉంటాయి.ఇంకా అలాగే చాలా మందికి పెదాలు పగులుతూ ఉంటాయి. ఇప్పుడు కాలం అనేది పూర్తిగా మారటంతో పెదాలు పగిలే సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పెదాలపై చాలా ఎక్కువ శ్రద్ద పెట్టవలసిన అవసరం చాలా ఉంది. చాలామంది పెదాలను గులాబీ రంగులో మార్చుకోవటానికి ఎక్కువగా బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ వేలకు వేలు డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు.అలా కాకుండా చాలా తక్కువ ఖర్చులో ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి ఫలితాన్ని పొందవచ్చు.



ఒక బౌల్ లో ఒక స్పూన్ నిమ్మరసం, అరస్పూన్ తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ పెదాలకు రాసి 5 నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే క్రమంగా పగిలిన,నల్లగా మారిన పెదాలు మృదువుగా,కాంతివంతంగా మారతాయి. నిమ్మకాయలో సహజమైన బ్లీచింగ్ ఇంకా ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాలు ఉండుట వలన చర్మంపై మృత చర్మ కణాలను తొలగిస్తుంది.అలాగే నిమ్మరసంలో ఉండే యాసిడ్ పెదాలపై నలుపును తగ్గిస్తుంది.ఇంకా అలాగే తేనె పెదాలకు తేమను అందిస్తుంది. ఇది పగిలిన పెదాలను ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది.ఇంకా తేలికపాటి ఎక్స్‌ఫోలియేటర్‌గా కూడా పనిచేసి చర్మంపై మృత చర్మ కణాలను తొలగిస్తుంది. కాబట్టి చాలా తక్కువ ఖర్చుతో చాలా సులభంగా నల్లగా మారిన పెదాలను ఈజీగా గులాబీ రంగులోకి మార్చుకోవచ్చు. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఈ టిప్ ట్రై చేయండి.మీ పెదాలను మృదువుగా ఎర్రగా మార్చుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: