చలికాలంలో చర్మం పొడిబారడం, నిర్జీవంగా మారడం వల్ల చర్మం చాలా డ్రైగా కనిపిస్తుంది. చర్మం పొడిబారడం వల్ల చర్మంపై దురద చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కొన్నిసార్లు చర్మం పొడిబారడం వల్ల పొరలుగా మారుతుంది. పెదవుల చుట్టూ, బుగ్గలపై, నుదుటిపై ఈ డ్రై స్కిన్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో చర్మంపై మాయిశ్చరైజర్ సరిపోదు. మారుతున్న సీజన్లలో మీ చర్మానికి అదనపు సంరక్షణ అవసరం. ఈ సీజన్‌లో చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచేందుకు ఆహారాన్ని మార్చుకోవాలి. ఎక్కువ నీరు తాగడం వల్ల చర్మం హైడ్రేట్ గా ఉంటుంది. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి హోం రెమెడీస్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. మారుతున్న సీజన్‌లో చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి ఏ టిప్స్ పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.బాదం నూనె చర్మంపై మంచి టానిక్‌గా పనిచేస్తుంది. చర్మ సంరక్షణకు ఉపయోగపడే ఈ నూనెలో విటమిన్-ఇ ఉంటుంది. ఈ ఆయిల్ చర్మాన్ని రిపేర్ చేస్తుంది. అలాగే చర్మానికి మెరుపును తెస్తుంది. ఈ నూనెతో చర్మాన్ని ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయడం మంచిది.
పెట్రోలియం జెల్లీ చర్మంపై ఔషధంలా పనిచేస్తుంది. పొడి చర్మాన్ని వదిలించుకోవడానికి పెట్రోలియం జెల్లీ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. పెట్రోలియం జెల్లీ చర్మంపై రక్షణ కవచంగా పనిచేస్తుంది. దీన్ని చర్మంపై ఉపయోగించడం వల్ల చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. ఇది స్కిన్ ఇరిటేషన్ తగ్గించి చర్మాన్ని ఆరోగ్యవంతంగా మార్చుతుంది.ఆరోగ్యంతో పాటు చర్మ సమస్యలను దూరం చేయడంలో తేనె ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది చర్మంపై మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. దీన్ని చర్మంపై ఉపయోగించడం వల్ల చర్మానికి పోషణ అందుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. 10 నిమిషాల పాటు తేనెతో చర్మాన్ని మసాజ్ చేయడం వల్ల చర్మం తేమగా ఉంటుంది.ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న కొబ్బరి నూనెలో ఎమోలియెంట్లు ఉంటాయి. ఇది జిగటగా ఉంటుంది. కొబ్బరిలో కొవ్వు ఉంటుంది. ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది. చర్మం పొడిబారడాన్ని తొలగించడంలో కొబ్బరి నూనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కొబ్బరి నూనెలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని మృదువుగా మార్చడంలో సహాయపడతాయి.