సహజసిద్ధమైన అందం కోసం ఇలా చెయ్యండి?

Purushottham Vinay
చర్మంపై ఆలివ్ నూనెను వాడటం వల్ల టాన్ వచ్చే అవకాశాలు చాలా ఈజీగా తగ్గుతాయి. ఇక ఈ నూనె సహజ సన్‌స్క్రీన్‌గా కూడా పనిచేస్తుంది. అదనంగా, ఆలివ్ నూనెలో విటమిన్ ఇ ఇంకా యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి.ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా బాగా సహాయపడతాయి. ఆలివ్ నూనెలో విటమిన్ ఎ, కె ఇంకా అలాగే ఇ ఉంటాయి. అలాగే, ఆలివ్ ఆయిల్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మ గాయాలను కూడా ఈజీగా నయం చేస్తాయి. ఆలివ్ ఆయిల్ చర్మాన్ని జెర్మ్స్ నుండి ఈజీగా రక్షిస్తుంది. అలాగే మొటిమల సమస్యలను నయం చేస్తుంది. ఆలివ్ ఆయిల్ చర్మ కణాలను పునరుద్ధరించడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. మీకు సున్నితమైన చర్మం గనుక ఉన్నట్లయితే మీరు ఆలివ్ నూనెను వాడవచ్చు. అయితే సన్ టాన్ ను దూరం చేసుకోవాలంటే ఆలివ్ ఆయిల్ ను ప్రత్యేకంగా ఉపయోగించాలి.తేలికపాటి క్లెన్సర్ వాడి చర్మాన్ని శుభ్రం చేయండి. తర్వాత కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ ని తీసుకుని దానిని చర్మంపై బాగా మసాజ్ చేయాలి.


అలాగే ఇక ఒక 15 నిమిషాలు ఉంచండి.అప్పుడు తడి టవల్  వాడి చర్మాన్ని తుడవండి. ఈ విధంగా ఆలివ్ నూనెను వాడటం వల్ల ట్యాన్ తొలగిపోతుంది.ఇక మీ చర్మం వడదెబ్బ తగిలితే మీరు మరొక విధంగా ఆలివ్ నూనెను వాడాలి. అర కప్పు లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్‌ను ఒక కప్పు ఆలివ్ ఆయిల్  ని కలపండి. దీన్ని టాన్ చేసిన ప్రదేశంలో రోజుకు నాలుగైదు సార్లు ఖచ్చితంగా అప్లై చేయండి. చర్మం చికాకు, మంట రెండూ కూడా తగ్గిపోతాయి.ఇక మీరు ఆలివ్ నూనెను మాయిశ్చరైజర్‌గా వాడటం ద్వారా కూడా టాన్‌ను తొలగించవచ్చు. స్నానం చేసే నీటిలో కొన్ని చెంచాల అదనపు పచ్చి ఆలివ్ నూనెని కలపండి. ఇప్పుడు ఆ నీటితో శుభ్రంగా స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత ముఖం తుడుచుకుంటే చర్మం చాలా మృదువుగా కనిపిస్తుంది. ఇది చర్మాన్ని అంత సులభంగా టాన్ కానీవ్వదు.ఇంకా అలాగే చలికాలంలో చర్మం చాలా మృదువుగా కూడా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: