జుట్టు రాలకుండా పొడవుగా పెరగడం కోసం ఇలా చెయ్యండి?

Purushottham Vinay
జుట్టు రాలకుండా పొడవుగా పెరగడం కోసం ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని వేడి చేయాలి. ఆ తరువాత ఇందులో గుప్పెడు తాజా కరివేపాకు ఆకులను వేసి బాగా మరిగించాలి. ఎందుకంటే కరివేపాకులో ఉండే పోషకాలు తలపై ఉండే మృత కణాలను చాలా ఈజీగా తొలగించి జుట్టు రాలడాన్ని ఈజీగా తగ్గిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ ఇ జుట్టును నల్లగా మార్చడంలో ఇంకా అలాగే జుట్టు కుదుళ్లను బలంగా మార్చడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. ఆ నీళ్లు మరిగిన తరువాత ఇందులో ఒక టీ స్పూన్ నల్ల జీలకర్రను కూడా అందులో వేయాలి. ఈ నల్ల జీలకర్రలో మన శరీరానికి అలాగే మన జుట్టుకు అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇక అవి మీ జుట్టును నల్లగా మార్చడంలో, జుట్టును తేమగా ఉంచడంలో ఇంకా అలాగే జుట్టు రాలడాన్ని తగ్గించడంలో ఈ నల్లజీలకర్ర మనకు ఎంతో సహాయపడుతుంది. ఆ తరువాత ఇందులో ఒక టీ స్పూన్ మెంతులను కూడా వేయాలి. ఇంకా ఈ మెంతుల్లో ఉండే పోషకాలు జుట్టు రాలడాన్ని చాలా ఈజీగా తగ్గించడంతో పాటు చుండ్రు సమస్యను ఇంకా అలాగే జుట్టు పొడిబారడాన్ని కూడా చాలా ఈజీగా నివారిస్తాయి.


ఆ తరువాత ఈ నీటిని అర గ్లాస్ అయ్యే దాకా బాగా మరిగించి గోరు వెచ్చగా అయిన తరువాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో ఒకటి లేదా రెండు టీ స్పూన్ల ఆముదం నూనెను వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఫ్రిజ్ లో ఉంచి స్టోర్ కూడా చేసుకోవచ్చు. అయితే దీనిని వాడే ప్రతిసారి కూడా ఇది గోరు వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న మిశ్రమంలో దూదిని ముంచి జుట్టు కుదుళ్లకు పట్టేలా బాగా రాయాలి లేదా ఒక స్ప్రే బాటిల్ లో ఈ మిశ్రమాన్ని వేసి జుట్టు కుదుళ్లకు పట్టేలా బాగా స్ప్రే చేసుకోవాలి. ఇక ఆ తరువాత సున్నితంగా మర్దనా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుపై రాత్రంతా కూడా అలాగే ఉంచి ఉదయాన్నే శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు నుండి మూడుసార్లు చేయడం వల్ల ఖచ్చితంగా జుట్టు రాలడం తగ్గుతుంది.ఇలా జుట్టుకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి. జుట్టు ఒత్తుగా ఇంకా పొడవుగా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: