జుట్టు ఆరోగ్యంగా ఇంకా అందంగా ఉండటం కోసం రకారకాల హెయిర్ అయిల్స్ కూడా వాడుతుంటారు. సాధారణంగా ఈ హెయిర్ ఆయిల్ వల్ల జుట్టుకు బలం చేకూరుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం హెయిర్ ఆయిల్‌తో జుట్టుకు మాత్రం అస్సలు మసాజ్ చేయకూడదు. ఏ సమయాల్లో జుట్టుకు అయిల్ రాయకూడదో తెలుసుకోవడం చాలా అవసరం. లేకుంటే జుట్టు సమస్యలు బాగా పెరుగుతాయి.చాలా మంది కూడా తల స్నానం చేయడానికి ముందు జుట్టుకు నూనె రాస్తారు. కానీ అసలు అలా రాయకూడదు. అయితే తల స్నానానికి కనీసం గంట ముందు హెయిర్ ఆయిల్ తో జుట్టుకు మసాజ్ చేయడం వల్ల మంచి ప్రయోజనం చేకూరుతుంది.ఇంకా అలాగే రాత్రి జుట్టును నూనెతో బాగా మసాజ్ చేసి ఉదయం పూట స్నానం చేయడం చాలా మంచిది. అయితే తల స్నానం చేయడానికి కొన్ని నిమిషాల ముందు మాత్రం నూనె రాసుకుని తల స్నానం అస్సలు చేయకూడదు.
తల తడిగా ఉన్న సమయంలో కూడా అస్సలు నూనె రాయకూడదు. బాగా ఆరిన తర్వాత మాత్రమే రాసుకోవాలి.కొన్నిసార్లు అయితే తలపై జుట్టు కింద బొబ్బలు అనేవి ఉంటాయి. అలాంటప్పుడు జుట్టుకు నూనె రాయడం వల్ల పొక్కులు బాగా వ్యాపిస్తాయి. అప్పుడు అవి త్వరగా తగ్గడం కష్టమవుతుంది.జుట్టుకు చుండ్రు పట్టకుండా ఉండేందుకు సాధారణంగా నూనె రాసుకుంటాం. జుట్టుకు ఎక్కువ చుండ్రు పట్టినట్లయితే అస్సలు నూనె రాసుకోకూడదు. చుండ్రు ఎక్కువుగా ఉన్నప్పుడు నూనె రాసుకోవడం వల్ల జుట్టులో చుండ్రు సమస్య చాలా ఎక్కువవుతుంది.ఇంకా అలాగే తలపై చర్మం జిడ్డుగా ఉంటూ జుట్టుకు ఎక్కువ నూనె రాయకూడదు. జిడ్డు చర్మానికి నూనె రాసుకుంటే జుట్టు కింద చర్మంపై మురికి చాలా ఎక్కువగా పేరుకుపోతుంది.ఇక దీని కారణంగా జుట్టు త్వరగా ఊడిపోతుంది. అలాగే తలపై చర్మం జిడ్డుగా ఉన్నప్పటికి హెయిర్ ఆయిల్ రాయడం అలవాటుగా చేసుకుంటే జుట్టు మరింత ఎక్కువగా రాలిపోతుంది.కాబట్టి ఇవి తెలుసుకొని హెయిర్ ఆయిల్ వాడటం మంచిది.