ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు నల్లగా అవ్వాలంటే?

Purushottham Vinay
ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగకుండా మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక మిశ్రమాన్ని తయారు చేసుకుని వాడడం వల్ల తెల్ల జుట్టు ఈజీగా నల్లగా మారడంతో పాటు జుట్టు ఒత్తుగా ఇంకా అలాగే ఆరోగ్యంగా కూడా పెరుగుతుంది. ఇక తెల్ల జుట్టును నల్లగా మార్చే ఈ మిశ్రమంని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా అడుగు మందంగా ఉండే ఒక ఇనుప కళాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఉసిరి పొడిని తీసుకోవాలి. ఆ తరువాత ఈ కళాయిని స్టవ్ మీద ఉంచి చిన్న మంటపై ఉసిరి పొడిని వేసి వేడి చేయాలి. ఇక దీనిని కలుపుతూ నల్లగా అయ్యే దాకా వేడి చేయాలి. ఇలా ఉసిరి కాయ పొడి నల్లగా మారిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకుని చల్లగా అయ్యే దాకా ఉంచాలి.ఆ తరువాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కాఫీ పొడిని వేసి బాగా కలపాలి.ఆ తరువాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జును ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను వేసి పేస్ట్ లా చేసి కలుపుకోవాలి.


 ఇలా తయారు చేయడం వల్ల జుట్టును నల్లగా మార్చే మిశ్రమం ఈజీగా తయారవుతుంది.ఇంకా దీనిని ఎలా వాడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని దూదితో లేదా బ్రష్ తో మీ జుట్టుకు రాసుకోవాలి. జుట్టు కుదుళ్ల నుండి జుట్టు చివరి దాకా ఈ మిశ్రమాన్ని బాగా పట్టించాలి. ఇంకా ఆ తరువాత దీనిని ఒక గంట పాటు అలాగే జుట్టుకు ఉంచాలి.ఒక గంట తరువాత రసాయనాలు తక్కువగా ఉండే షాంపుతో శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తూ నెలరోజుల పాటు దీనిని పాటించడం వల్ల ఖచ్చితంగా మన తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.ఇంకా అలాగే దీనిని ఉపయోగించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కూడా మీకు ఉండవు. ఈ టిప్ ని వాడడం వల్ల జుట్టు నల్లగా మారడంతో పాటు జుట్టు పొడవుగా ఇంకా ఆరోగ్యంగా కూడా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: