ముఖంపై మంగు మచ్చలు ఈజీగా పోవాలంటే..?

Purushottham Vinay
చాలా మంది కూడా ముఖంపై మంగు మచ్చలతో బాధపడుతూ ఉంటారు. ఇవి ఎక్కువగా ముక్కు మీద, బుగ్గల మీద అలాగే నుదుటి మీద ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎండలో ఎక్కువగా తిరగడం, హార్మోన్ల అసమతుల్యత, పోషకాహార లోపం, ఒత్తిడి ఇంకా అలాగే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు మందులను వాడడం, శరీరంలో ఉండే వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ ఇంకా శరీరంలో మలినాలు పేరుకుపోవడం వంటి వాటి వల్ల ముఖంపై మంగు మచ్చలు అలాగే నల్ల మచ్చలు వస్తూ ఉంటాయి. ఈ మచ్చలు స్త్రీ, పురుషులిద్దరిలో కూడా వస్తాయి. ముఖంపై ఉండే మచ్చలు తగ్గి ముఖం అందంగా కనబడాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు.అయితే ఈ చిట్కాతో చాలా సులభంగా ముఖంపై ఉండే మంగు మచ్చలను, నల్లమచ్చలను తొలగించుకోవచ్చు. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి మనం మెంతి ఆకులను ఉపయోగించాల్సి ఉంటుంది.ఈ మెంతిఆకుల్లో ఉండే ఔషధ గుణాలు మెలనిన్ ఉత్పత్తిని తగ్గించి చర్మం తెల్లగా మారడంలో ఎంతగానో సహాయపడతాయి. ఇంకా అలాగే మనం బంగాళాదుంపను కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. బంగాళాదుంప మంచి బ్లీచింగ్ ఏజెంట్ గా పని చేస్తుంది. ఇది చర్మాన్ని తెల్లగా మార్చడంలో ఎంతగానో సహాయపడుతుంది.


మీరు ముందుగా బంగాళాదుంపపై ఉండే చెక్కును తీసివేయాలి. ఆ తరువాత ఒక జార్ లో మెంతి ఆకులను ఇంకా అర చెక్క బంగాళాదుంపను ముక్కలుగా చేసి వేసుకోవాలి.ఆ తరువాత వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టుకుని దాని నుండి వచ్చే రసాన్ని మీరు ఒక గిన్నెలోకి తీసుకోవాలి.ఆ తరువాత ఈ మిశ్రమంలో ఒక టీ స్పూన్ పెరుగు, ఒక టీ స్పూన్ నిమ్మరసం, ఒక టీ స్పూన్ తేనె ఇంకా అలాగే ఒక టీ స్పూన్ ముల్తానీ మట్టి వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని చర్మానికి రాసుకుని ఆరిన తరువాత నీటితో శుభ్రంగా కడిగి వేయాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేయడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. ఈ టిప్ ని వాడిన పది నుండి పదిహేను రోజుల్లోనే మనం ముఖంలో వచ్చే మార్పును ఈజీగా గమనించవచ్చు. ఈ టిప్ ని వాడడం వల్ల ముఖంపై ఉండే మంగు మచ్చలు, నల్ల మచ్చలు ఈజీగా తగ్గుతాయి. ఎండ వల్ల నల్లగా మారిన చర్మం కూడా తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది. ఈ టిప్ ని వాడడం వల్ల మనం ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చాలా సులభంగా ముఖంపై ఉండే మంగు మచ్చలను ఈజీగా తగ్గించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: