మన శరీరంలో పోషకాహార లోపం, దుమ్ము-మట్టి ఇంకా అలాగే కాలుష్యం వల్ల జుట్టు సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే చాలా మందిలో జుట్టు రాలడంతో పాటు, తెల్ల జుట్టు సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి.ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.చాలా మందిలో జుట్టు రాలడం, చుండ్రు ఇంకా గిరజాల జుట్టు సమస్య రావడం చాలా సర్వసాధారణం. ఈ జుట్టు సమస్యలకు కొన్ని న్యాచురల్ హెయిర్ టిప్స్ తో ఈజీగా చెక్ పెట్టొచ్చు.అయితే ఎలాంటి హెయిర్ టిప్స్ పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.పెరుగు, కరివేపాకు హెయిర్ ఫ్యాక్‌ను ట్రై చెయ్యడం వల్ల జుట్టుకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఈ రెండింటిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ ఇంకా యాంటీ ఫంగల్ లక్షణాలు చాలా పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి వీటితో తయారు చేసిన హెయిర్ టిప్ ని వినియోగించడం వల్ల జుట్టు బాగా మెరిసేలా తయారవుతుంది.ఇంకా అంతేకాకుండా తెల్ల జుట్టు సమస్యల నుంచి చాలా ఈజీగా ఉపశమనం లభిస్తుంది.అలాగే కరివేపాకు, పెరుగు రెండూ జుట్టుకు చాలా రకాలుగా మేలు చేస్తాయి. ఈ రెండూ కూడా మాయిశ్చరైజింగ్ గుణాలను ఎక్కువగా కలిగి ఉంటాయి.
ఇక ఇవి జుట్టులో తేమను లాక్ చేయడానికి ఇంకా మెరిసేలా కనిపించేందుకు ఎంతగానో సహాయపడతాయి. ఈ రెండింటిలో కూడా జుట్టును ఆరోగ్యంగా ఉంచే లక్షణాలు ఎక్కువగా లభిస్తాయి. కాబట్టి తెల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి ఇవి ఎంతగానో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి పెరుగు-కరివేపాకు హెయిర్ ప్యాక్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.కరివేపాకు-పెరుగు హెయిర్ మాస్క్‌ను ఇలా తయారు చేసుకోండి. ఈ హెయిర్ ప్యాక్ కోసం.. ముందుగా ఒక 20 కరివేపాకులను తీసుకోండి.ఆ తరువాత వాటిని కడిగి మెత్తగా రుబ్బుకోవాలి.తర్వాత అందులో మూడు స్పూన్ల పెరుగు వేసి బాగా కలపాలి.తరువాత పెరుగు-కరివేపాకులను కూడా మిక్సీలో వేసి మిశ్రమంలా తయారు చేసుకోవాలి.ఇక అందులోనే 1 నుంచి 2 టీస్పూన్ల కాస్టర్ ఆయిల్ ని వేయాలి. వీటన్నిటిని బాగా కలపాలి.తరువాత ఈ పేస్ట్‌ను 1 గంట ముందు జుట్టుకు అప్లై చేయాలి.ఒక గంట తర్వాత జుట్టును శుభ్రమైన నీటితో కడగాలి.ఇలా ఈ టిప్ ని వారానికి 2-3 సార్లు ఉపయోగిస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.