మెడపై నలుపుని పోగొట్టే పవర్ ఫుల్ రెమెడీ?

frame మెడపై నలుపుని పోగొట్టే పవర్ ఫుల్ రెమెడీ?

Purushottham Vinay
చాలా మందికి మెడ భాగం చాలా నల్లగా ఉంటుంది.ఇది చూడటానికి చాలా అందవిహీనంగా కనిపిస్తుంది.హార్మోన్ చేంజ్, ఎండల ప్రభావం, ప్రెగ్నెన్సీ, ఆహారపు అలవాట్లు, శరీరంలో అధిక వేడి ఇంకా అలాగే మృత కణాలు ఎక్కువగా పేరుకుపోవడం వంటి కారణాల వల్ల మెడ నల్లగా మారుతుంటుంది.అయితే ఒక్కోసారి ఎన్ని ప్రయత్నాలు, ప్రయోగాలు చేసినా కూడా మెడ నలుపు అనేది తగ్గదు.అయితే కేవలం ఇరవై నిమిషాల్లోనే మెడ నలుపును మాయం చేసే సూపర్ రెమెడీ ఒకటి ఉంది. ఈ రెమెడీతో చాలా సులభంగా మెడ నలుపును తగ్గించుకోవచ్చు.ఇక ఆ రెమెడి ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ ని తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు Eno పౌడర్ ను వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వైట్ టూత్ పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇంకా మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు కోకోనట్ ఆయిల్ ని వేసుకుని అన్నీ కూడా బాగా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి.


ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెడపై అప్లై చేసుకుని ఒక పది నిమిషాల పాటు అలాగే ఆరబెట్టుకోవాలి. ఇక ఆ తర్వాత అర నిమ్మ చెక్కను తీసుకుని మెడను కనీసం మూడు లేదా నాలుగు నిమిషాల పాటు సాఫ్ట్ గా రబ్ చేసుకోవాలి. ఆ తరువాత వాటర్ తో శుభ్రంగా మెడను క్లీన్ చేసుకోవాలి.మీరు ఇలా చేస్తే మెడ నలుపు చాలా వరకు మాయం అవుతుంది. రెండు రోజులకు ఒకసారి ఏ రెమెడీని పాటిస్తే మెడ కొద్ది రోజుల్లోనే తెల్లగా ఇంకా కాంతివంతంగా మారుతుంది. మెడ నలుపును తగ్గించడానికి ఈ రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. కాబట్టి ఎవరైతే మెడ నలుపు తో బాగా బాధపడుతున్నారో తప్పకుండా వారు ఈ హోమ్ రెమెడీని ప్రయత్నించండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసిన ఈ సమస్య తగ్గనివారు ఖచ్చితంగా ఈ టిప్ ట్రై చెయ్యండి. ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: