దంతాలపై గారను పసుపుదనాన్ని పోగొట్టే చిట్కాలు?

Purushottham Vinay
దంతాలపై గారను ఇంకా పసుపుదనాన్ని పోగొట్టడానికి ఎన్నో రకాల టూత్ పేస్ట్ లను వాడుతూ ఉంటారు. అయిన ఫలితం లేక  చాలా మంది ఎంతగానో ఇబ్బందిపడుతూ ఉంటారు. అలాంటి వారు కొన్ని  ఇంటి చిట్కాలను వాడడం వల్ల చాలా సులభంగా పళ్ళని తెల్లగా మార్చుకోవచ్చు. ఈ టిప్స్ తయారు చేసుకోవడం అలాగే వాడడం కూడా చాలా సులభం. దంతాలను తెల్లగా మార్చే ఈ టిప్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ టిప్ తయారు చేసుకోవడానికి  ముందుగా అర చెక్క టమాటను, ఉప్పును ఇంకా అలాగే ఒక పూర్తి కమలా పండు తొక్కను వాడాల్సి ఉంటుంది. ముందుగా జార్ లో కమలా పండు తొక్క ఇంకా టమాట ముక్క వేసి మెత్తగా పేస్ట్ లాగా చేయాలి. తరువాత దీనిని బ్రష్ తో తీసుకుని దానిపై ఉప్పును చల్లి దంతాలను బాగా శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమంతో 4 నుండి 5 నిమిషాల పాటు దంతాలను బాగా శుభ్రం చేసుకుని ఆ తరువాత సాధారణ టూత్ పేస్ట్ తో దంతాలను బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల దంతాలపై గార ఇంకా పసుపుదనం తొలగిపోయి దంతాలు తెల్లగా అలాగే ఆరోగ్యంగా మారతాయి. దంతాలను తెల్లగా మార్చడంలో వంటసోడా కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది.


ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె, పావు టేబుల్ స్పూన్ ఉప్పు ఇంకా అర టీ స్పూన్ వంటసోడా వేసి కలపాలి.తరువాత ఈ మిశ్రమాన్ని బ్రష్ తో తీసుకుని పళ్ళని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ఈ టిప్ ని వాడడం వల్ల దంతాలు చాలా ఈజీగా తెల్లగా మారతాయి.అయితే ఈ టిప్ ని నెలకు రెండు సార్లు మాత్రమే ఉపయోగించాలి. అలాగే సున్నితమైన దంతాలు ఉన్న వారు ఈ టిప్ ని వాడకపోవడమే మంచిది. అదే విధంగా నల్ల నువ్వులు కూడా దంతాలను బాగా శుభ్రపరుస్తాయి.ఇందు కోసం ముందుగా 2 లేదా 3 టీ స్పూన్ల నల్ల నువ్వులను నోట్లో వేసుకుని వాటిని బాగా నమలాలి. ఆ తరువాత బ్రష్ మీద 4 లేదా 5 చుక్కల లవంగం నూనెను వేసి దంతాలను బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా ప్రతిరోజూ చేయడం వల్ల దంతాలపై పేరుకుపోయిన గారె చాలా ఈజీగా తొలగిపోతుంది. దంతాలు ఇంకా చిగుళ్ల సమస్యలు కూడా చాలా సులభంగా తగ్గుతాయి. ఈ విధంగా ఈ టిప్స్ వాడడం వల్ల చాలా సులభంగా ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా దంతాలను ఈజీగా తెల్లగా మార్చుకోవచ్చు. ఈ టిప్స్ ని వాడడం వల్ల దంతాల ఆరోగ్యం కూడా చాలా బాగా మెరుగుపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: