కొంతమందికి వారి జుట్టు చాలా పల్చగా ఉంటుంది. రోజు జుట్టు ఊడుతుంది కానీ కొత్త జుట్టు రాదు. దీని వల్ల వెంట్రుకలు పల్చగా మారిపోతుంటాయి.పల్చటి జుట్టు వల్ల ఎలాంటి హెయిర్ స్టైల్స్ చేసుకోలేరు. ఈ క్రమంలోనే చాలామంది జుట్టును మళ్ళీ ఒత్తుగా మార్చుకునేందుకు చాలా విధాలుగా ప్రయత్నిస్తుంటారు.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ చాలా అద్భుతంగా పనికొస్తుంది.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే జుట్టు ఎంత పల్చగా ఉన్నా సరే నెల రోజుల్లో ఈజీగా ఒత్తుగా పెరగడం ప్రారంభం అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం జుట్టును ఒత్తుగా మార్చే ఆ హోమ్ రెమెడీ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ని ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాసుల వాటర్ ని పోయాలి.ఆ వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు ఇంకా ఒక టేబుల్ స్పూన్ బియ్యం, వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి కనీసం పది నుంచి పన్నెండు నిమిషాల పాటు అలాగే ఉడికించాలి.
ఇక ఆ తరువాత స్టవ్ ని ఆఫ్ చేసి స్ట్రైనర్ సహాయం తో జెల్లీ స్ట్రక్చర్ లో ఉండే జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి. ఈ జ్యూస్ లో అరకప్పు ఉల్లి రసం ఇంకా టేబుల్ స్పూన్ ఆముదం,సగం టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి బాగా పట్టించి షవర్ క్యాప్ ధరించాలి. ఒక గంటన్నర లేదా రెండు గంటల తరువాత మైల్డ్ షాంపూ ను ఉపయోగించి బాగా శుభ్రంగా తల స్నానం చేయాలి. వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే హెయిర్ గ్రోత్ చాలా అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది. పల్చటి జుట్టు కొద్ది రోజుల్లోనే ఈజీగా ఒత్తుగా మారుతుంది. అదే సమయంలో హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. వెంట్రుకలు స్మూత్ అండ్ సిల్కీగా మెరుస్తాయి. కాబట్టి పల్చటి జుట్టుతో బాధపడేవారు తప్పకుండా ఈ రెమెడీని ట్రై చెయ్యండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.