మిమ్మల్ని అందంగా యంగ్ గా మార్చే జ్యూస్ లు ఇవే?

Purushottham Vinay
ప్రతి ఒక్కరూ కూడా అందంగా కనిపించేందుకు చాలా రకాల మార్గాలను అనుసరిస్తున్నారు.అయితే అందంగా కనపడాలంటే ఖచ్చితంగా కూడా పోషకాలు ఉండే ఆహారాలను తీసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే వీటి వల్ల చర్మం యవ్వనంగా మారుతుంది. ముడతలు తగ్గుతాయి.ఇక అలాంటి ఆహారాల విషయానికి వస్తే.. మనకు కొన్ని రకాల జ్యూస్‌లు బాగా తోడ్పడుతాయి.ఇప్పుడు చెప్పే జ్యూస్‌లలో ఏదైనా ఒక్క దాన్ని రోజూ తాగితే చాలా ఈజీగా నెల రోజుల్లోనే మంచి మార్పు కనిపిస్తుంది. ఖచ్చితంగా యంగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది. వయస్సు ఎంత ఉన్నా కానీ 20 ఏళ్ల వారిలాగా ఉన్నట్లుగా కనిపిస్తారు.పాలకూర, కీరదోస, గ్రీన్ యాపిల్‌, నిమ్మకాయ ఇంకా అల్లం. వీటిని కలిపి జ్యూస్‌ను తయారు చేసి రోజుకు ఒక గ్లాస్  తాగాలి.ఎందుకంటే వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతాయి.అలాగే కీరదోస అనేది మన చర్మానికి కావల్సిన తేమను కూడా అందిస్తుంది. నిమ్మరసం, అల్లం రసం చర్మంలో ఉండే వ్యర్థాలను ఈజీగా బయటకు పంపుతాయి. దీంతో చర్మ కాంతి కూడా బాగా పెరుగుతుంది. చర్మం ప్రకాశవంతంగా మారి చాలా యవ్వనంగా కనిపిస్తారు.


ఇంకా అలాగే క్యారెట్లు, నారింజలు తీసుకొని వాటికి కాస్త పసుపు వేసి జ్యూస్ తయారు చేసి తాగవచ్చు. ఈ క్యారెట్లలో ఉండే బీటా కెరోటిన్ మన శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. ఇది చర్మాన్ని సంరక్షించి మంచి కాంతిని అందిస్తుంది. ఇంకా అలాగే నారింజల్లో ఉండే విటమిన్ సి చర్మాన్ని బాగా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇంకా చర్మం ముడతలు పడకుండా చూస్తుంది.అలాగే పసుపులో కూడా యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి వాపులను ఈజీగా తగ్గిస్తాయి. అందువల్ల చర్మం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా యవ్వనంగా కనిపిస్తుంది.బీట్‌రూట్‌, బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలతో జ్యూస్‌ను తయారు చేసి అందులో నిమ్మరసం కలిపి తాగితే చాలా మంచిది. ఈ జ్యూస్ కూడా చర్మానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. అలాగే చర్మంలో రక్త సరఫరాను పెంచుతుంది. అందువల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.ఇంకా అలాగే పుచ్చకాయ, పుదీనా ఆకుల జ్యూస్ లేదా పైనాపిల్‌, కీరదోస కలిపి జ్యూస్ చేసి కూడా తాగవచ్చు. ఇక ఈ జ్యూస్‌లలో ఏదైనా ఒక్కదాన్ని రోజూ తాగడం వల్ల నెల రోజుల్లోనే మీకు మార్పు కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: