మీ అందం రెట్టింపు కావాలంటే..?

frame మీ అందం రెట్టింపు కావాలంటే..?

Purushottham Vinay
బయట మార్కెట్లో దొరికే క్రీములు వాడకుండా మన ఇంట్లో మనకు న్యాచురల్ గా దొరికే కొన్ని పదార్థాలతో తయారు చేసే మిశ్రమాన్ని వాడితే మన ముఖ సౌందర్యం ఖచ్చితంగా పెరుగుతుంది. ఇంకా అంతేకాదు, ముఖంపై ఉండే మచ్చలు కూడా చాలా ఈజీగా పోతాయి. అయితే ఇంతకీ ఆ పదార్థాలు ఏమిటి..? ఆ మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలి? వంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.ముందుగా మీరు ఒక బౌల్‌ ని తీసుకుని అందులో అర టీస్పూన్ బేకింగ్ సోడా ఇంకా 1 టీస్పూన్ కొబ్బరి నూనెను కలపాలి. అయితే సెన్సిటివ్ చర్మం ఉన్న వారు మాత్రం 1/4 టీస్పూన్ బేకింగ్ సోడా వాడినా చాలు. ఇలా చెప్పిన మోతాదులో రెండు పదార్థాలను కలిపి మిశ్రమంగా చేసుకోని దీన్ని ముఖమంతటా కూడా రాయాలి. తరువాత ఒక నిమిషం ఆగాక వేడిగా ఉన్న నాప్‌కిన్ టవల్‌తో శుభ్రంగా తుడిచేయాలి. అందువల్ల మీకు తేడా కచ్చితంగా తెలుస్తుంది. ఇక ఇలా చేయడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


పైన చెప్పిన విధంగా మిశ్రమాన్ని తయారు చేసుకుని తరచూ వాడుతుంటే దాంతో చాలా ముఖం కాంతివంతంగా మారుతుంది.అలాగే చర్మం మృదువుగా ఉంటుంది. ఇంకా ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు చాలా ఈజీగా పోతాయి.అసలు అవి ఉండవని తేడా కూడా తెలియనంతగా కూడా ముఖం మారుతుంది. రెగ్యులర్‌గా ఈ మిశ్రమాన్ని వాడితే పొడి చర్మం సమస్య కూడా ఉండదు. చర్మం మృదువుగా ఇంకా ప్రకాశవంతంగా మారుతుంది. అలాగే ముఖంపై ఉండే చర్మం పీహెచ్ స్థాయిలు బ్యాలెన్స్ అవుతాయి. అందువల్ల చర్మం చాలా ఆరోగ్యంగా ఉంటుంది.ఇంకా అలాగే ముఖం చర్మం లోపల ఉండే రక్త నాళాల్లో రక్త సరఫరా బాగా మెరుగుపడుతుంది. దీంతో ముఖ సౌందర్యం అనేది బాగా పెరుగుతుంది. అయితే ఈ మిశ్రమాన్ని వాడే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా బాగా తుడవాలి. ఆ తరువాతే దీన్ని అప్లై చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం పొందవచ్చు. అయితే ఈ క్రమంలో ఈ మిశ్రమం వెంట్రుకలకు మాత్రం తగలకూడదు. లేదంటే వెంట్రుకలు అంతా కూడా జిడ్డుగా మారుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: