తెల్లజుట్టు సమస్యతో ఎక్కువగా బాధపడే వారు కొన్ని ఆయుర్వేద చిట్కాలను వాడడం వల్ల చాలా ఈజీగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. పైగా ఈ చిట్కాలను వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఇంకా అలాగే జుట్టు ఎదుగుదల కూడా చాలా చక్కగా ఉంటుంది. తెల్లజుట్టును నల్లగా మార్చే ఆ ఆయుర్వేద చిట్కాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుంటగలగరాకు... దీనినే భృంగరాజ్ అని కూడా అంటారు. తెల్లజుట్టును నల్లగా మార్చడంలో ఈ గంటగలగరాకు నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. మనకి ఆయుర్వేద షాపుల్లో, ఆన్ లైన్ లో గుంటగలగరాకు నూనె సులభంగా లభిస్తుంది.ఈ నూనెను తీసుకొని దానిని గోరు వెచ్చగా చేసి జుట్టు కుదుళ్లల్లోకి ఇంకేలా బాగా పట్టించాలి. ఇలా చేయడం వల్ల తెల్లజుట్టు నల్లగా మారడంతో పాటు ఇతర జుట్టు సమస్యలు కూడా ఈజీగా తగ్గుతాయి. జుట్టు ఒత్తుగా ఇంకా చాలా ఆరోగ్యంగా పెరుగుతుంది.అలాగే ఉసిరికాయ కూడా మనకు ఎంతగానో సహాయపడుతుంది. ఎందుకంటే దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఈ తాజా ఉసిరికాయలను తినడం వల్ల లేదా ఉసిరి నూనెను జుట్టుకు రాసుకోవడం వల్ల జుట్టు తెల్లగా మారకుండా ఉంటుంది.ఇంకా అలాగే కరివేపాకును వాడడం వల్ల కూడా మనం జుట్టు తెల్లగా మారకుండా చేసుకోవచ్చు.
ఎందుకంటే దీనిలో ఉండే చాలా రకాల పోషకాలు జుట్టు తెల్లగా మారకుండా చేయడంలో సహాయపడతాయి.ఈ కరివేపాకును ఆహారంలో తీసుకోవడం ద్వారా అలాగే కరివేపాకును పేస్ట్ గా చేసి జుట్టుకు పట్టించడం వల్ల మన జుట్టు నల్లగా ఇంకా ఒత్తుగా ఉంటుంది. అలాగే తెల్లజుట్టు సమస్యతో బాధపడే వారు అశ్వగంధ పొడిని లేదా టాబ్లెట్ లను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.ఇంకా అలాగే వేప నూనెను లేదా వేపాకుల పేస్ట్ ను తలకు పట్టించడం వల్ల కూడా మన జుట్టు తెల్లగా మారకుండా ఉంటుంది.ఇంకా అలాగే గోరింటాకు పొడిని( హెన్నా పౌడర్) ను పేస్ట్ లాగా చేసి జుట్టుకు పట్టిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా తెల్లజుట్టు నల్లగా మారుతుంది.ఇంకా అదే విధంగా కొబ్బరి నూనెను, నిమ్మరసాన్ని సమానంగా తీసుకుని జుట్టుకు బాగా పట్టించాలి.ఇక ఇలా పట్టించడం వల్ల జుట్టు తెల్లబడకుండా ఉంటుంది.ఇంకా అలాగే నువ్వుల నూనెను గోరు వెచ్చగా చేసి జుట్టు కుదుళ్లకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి తెల్లజుట్టు ఈజీగా నల్లగా మారుతుంది. ఇంకా అదే విధంగా తెల్లజుట్టు సమస్యతో బాధపడే వారు త్రిఫలా చూర్ణాన్ని తీసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది.