ఇక మంగుమచ్చల సమస్య చాలా మందిని ఎంతగానో వేధించే సమస్య. ఎక్కువగా ఎండలో తిరగడం వల్ల, వంశపారంపర్యంగా ఇంకా హార్మోన్లలో సమతుల్యత లోపించడం వంటి వాటి వల్ల ఈ మచ్చలు ఎక్కువగా ఏర్పడతాయి.అలాగే ముఖంపై కూడా ఈ నల్లని మంగుమచ్చలు చూడటానికి చాలా అంటే చాలా ఇబ్బందిగా కనిపిస్తాయి. అయితే ఎటువంటి కెమికల్స్ వాడకుండానే సహాజ సిద్ధంగా మంచుమచ్చలను ఎలా తొలగించుకోవచ్చు? ఈ సింపుల్ టిప్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక గేదె పాలను చిలికి తీసిన వెన్నను మంగుమచ్చలపై ప్రతి రోజూ కూడా రుద్దుతుంటే మచ్చలు ఈజీగా తగ్గుతాయి. అలాగే పచ్చి పసుపు, ఎర్రచందనం కలిపి పాలల్లో నూరి రాస్తే మంగు మచ్చలు ఈజీగా తగ్గుతాయి. ఇంకా అలాగే జాజికాయను మేకపాలలో అరగదీసి రాయడం వల్ల కూడా మంచి రిజల్ట్ కనిపిస్తుంది.అలాగే పాలల్లో ఎర్ర కందిపప్పు నూరి నేతిలో కలిపి మంగు మచ్చలపై రాస్తే ఇక కొద్ది రోజుల్లోనే నలుపుదనం పోతుంది.ఇంకా పావు టీ స్పూన్ నిమ్మరసానికి సమంగా తేనె కలిపి మచ్చలపై రుద్ది ఒక 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి.
ఇలా చేస్తే నెల రోజుల్లోనే మీకు చాలా మంచి ఫలితం ఉంటుంది.అలాగే టొమాటో గుజ్జుతో మచ్చలపై బాగా రుద్ది ఒక 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగితే మచ్చలు ఈజీగా తగ్గి శరీర కాంతి మెరుగవుతుంది.అలాగే కలబంద గుజ్జును మచ్చలపై పూయాలి. ఇలా రోజూ చేయడం వల్ల మచ్చలు ఈజీగా తగ్గి మొటిమలు, వాటి తాలూకూ మచ్చలు కూడా పూర్తిగా తొలిగిపోతాయి.అలాగే ఒక టీ స్పూన్ టొమాటో రసం, టీ స్పూర్ గంధం పొడి కలిపి తరువాత 2 టీ స్పూన్ల ముల్తానీ మట్టితో పేస్టులా చేసుకొని మచ్చలపై రాయాలి.ఇక ఒక 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి.ఇలా మీరు వారానికి రెండు, మూడుసార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.అలాగే రోజ్‌వాటర్, కీరాదోస రసం, నిర్మరసం ఇంకా తేనె సమంగా కలిపి మచ్చలపై రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కుంటే ఒక్క నెలలోనే మీకు మంచి మార్పు కనిపిస్తుంది.అలాగే ఆలుగడ్డ పొట్ట తీసి సన్నగా తురిమి పల్చని గుడ్డలో పిండిరసం తీయాలి. దీన్ని దూదిలో నానబెట్టి ఒక 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కుంటే మంగు మచ్చలు మచ్చలు తొలిగిపోతాయి.