ఇలా చేస్తే ముఖం చిటికెలో మెరిసిపోతుంది?

Purushottham Vinay
ముఖం బాగా అందంగా మెరవాలని చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంకా అందుకోసం బ్యూటీ పార్లల్ల చుట్టూ తిరిగి వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ముఖం అందంగా కాంతివంతంగా మెరిసిపోవాలని కోరుకుంటున్నారు.ముఖం మీద మొటిమలు వచ్చినా ఇంకా చిన్న మచ్చలు వచ్చిన చాలా కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే క్రీమ్ తెగ వాడేస్తూ ఉంటారు.అయితే అలా కాకుండా కొన్ని ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సులభంగా మెరిసే కాంతివంతమైన ముఖాన్ని పొందొచ్చు. ఇప్పుడు మనం చెప్పుకునే టిప్ కోసం కేవలం మూడు ఇంగ్రిడియన్స్ వాడితే సరిపోతుంది.ఒక బౌల్ లో అరస్పూన్ పసుపు,అరస్పూన్ ఆలోవెరా జెల్ ఇంకా అలాగే ఒక స్పూన్ నిమ్మరసం వేసి వాటిని బాగా కలిపి ముఖానికి రాసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రంగా చేసుకోవాలి.



ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే ఖచ్చితంగా ముఖం మీద నల్లని మచ్చలు,మొటిమలు అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.అలాగే పసుపులో యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ-ట్యానింగ్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల మొటిమలు, టానింగ్, సన్‌బర్న్ ఇంకా ముడతలు వంటి చర్మ సమస్యలు తొలగిపోవడానికి సహాయపడుతుంది. అయితే ఈ పసుపును మార్కెట్ లో కొనకుండా పసుపు కొమ్ములను తెచ్చుకొని మెత్తని పొడిగా చేసుకొని వాడితే చాలా మంచిది.ఇంకా అలాగే అలోవెరా ముడతలు, మొటిమలని నివారించి చర్మాన్ని బాగా మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇంకా అంతేకాకుండా చర్మం మీద పేరుకుపోయిన మృతకణాలని కూడా చాలా ఈజీగా తొలగిస్తుంది. ఇంకా దద్దుర్లు, మొటిమలు, గాయాలని కూడా ఈజీగా నయం చేస్తుంది. అలాగే వృద్ధాప్య సంకేతాలు కనిపించకుండా చేయడంలో సహాయపడి చర్మం ఎప్పుడు ఎంతో యవ్వనంగా ఉండేలా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: