ఇంట్లోనే వేప ఆకులతో కొన్ని ఫేస్ ప్యాక్‌లను తయారు చేసుకొని అప్లై చేసుకుంటే మొటిమల సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు. ఈ ప్యాక్స్ వల్ల ముఖం మరింత అందంగా ఇంకా స్పష్టంగా తయారవుతుంది. మొటిమల నివారణ కోసం వేప ఫేస్ ప్యాక్ ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వేప, నిమ్మరసం ఫేస్ ప్యాక్ ఈజీగా మొటిమలను తగ్గిస్తుంది. నిమ్మకాయ మొటిమల మచ్చలను ఈజీగా తేలికపరుస్తుంది. ఇంకా చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. ఒక 2 టేబుల్ స్పూన్ల వేప పొడిలో కొన్ని చుక్కల రోజ్ వాటర్ ఇంకా కొన్ని చుక్కల నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయాలి. తరువాత ఈ ఫేస్ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి ఒక 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా ముఖం కడిగేసుకోవాలి.ఇక వేప, దోసకాయ ఫేస్ ప్యాక్ మొటిమలను తగ్గించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందుకోసం ముందుగా మీరు దోసకాయను పేస్ట్ చేయండి. 1 టేబుల్ స్పూన్ వేప ఆకుల పొడి ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆర్గాన్ ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి. అది బాగా ఆరిపోయిన తర్వాత బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి.
అలాగే చర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా చేయడానికి 1 చెంచా వేప పొడికి 2 చెంచాల శెనగపిండి, అర చెంచా పసుపు ఇంకా అర చెంచా రోజ్ వాటర్ కలపాలి. దీన్ని ముఖానికి బాగా పట్టించి ఒక ఐదు నిమిషాల పాటు స్మూత్‌గా మసాజ్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాలు పాటు అలాగే వదిలేయాలి.అది బాగా ఆరిపోయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడగాలి.అలాగే వేప, గంధం రెండూ చర్మానికి మంచి పోషణనిస్తాయి. మొటిమలు, దద్దుర్లు ఇంకా చికాకులను నయం చేయడంలో బాగా సహాయపడుతుంది.ఇందుకోసం మీరు 2 చెంచాల గంధపు పొడి, 1 చెంచా రోజ్ వాటర్, 2 చెంచాల వేప పొడిని నీటిలో కలపండి. తరువాత ఈ ఫేస్ ప్యాక్ ను మీ ముఖంపై ఒక 20 నిమిషాల పాటు ఉంచండి. ఆ తర్వాత చల్లటి నీటితో మీ ముఖాన్ని బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి.కాబట్టి ఖచ్చితంగా ఈ ప్యాక్స్ ట్రై చెయ్యండి. ఖచ్చితంగా మొటిమలు తగ్గి ముఖం అందంగా కాంతివంతంగా తయారవుతుంది.