చుండ్రుని ఈ సింపుల్ చిట్కాతో పోగొట్టండి?
చుండ్రు వల్ల తలలో దురద, జుట్టు రాలడం, కోపం, చిరాకు వంటి సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి. ఈ సమస్య నుండి బయటపడడానికి చాలా మంది కూడా అనేక రకాల షాంపులను, మందులను కూడా వాడుతూ ఉంటారు.అయినా కానీ ఈ సమస్య నుండి పూర్తి ఉపశమనం కలగదనే చెప్పవచ్చు.చుండ్రు సమస్యతో బాధపడే వారు ఇప్పుడు చెప్పే టిప్ ని వాడడం వల్ల చక్కటి ఉపశమనం కలుగుతుందని చెప్పవచ్చు. కేవలం మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఈ టిప్ ని తయారు చేసుకుని వాడడం వల్ల చుండ్రు సమస్య నుండి చాలా ఈజీగా శాశ్వతంగా బయటపడవచ్చు. ఈ టిప్ ని చాలా తక్కువ ఖర్చులో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. చుండ్రు సమస్యను నివారించే ఈ టిప్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి గానూ మనం నిమ్మరసాన్ని, కొబ్బరి నూనెను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఒక గిన్నెలో 4 కప్పుల గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో 2 స్పూన్ల నిమ్మరసం, 4 స్పూన్ల కొబ్బరి నూనె వేసి కలపాలి.ఆ తరువాత ఈ మిశ్రమాన్ని అంతా కలిసేలా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు తలకు బాగా పట్టించాలి. ఆ తరువాత తలకు వస్త్రాన్ని చుట్టుకుని పడుకోవాలి.దీనిని రాత్రంతా కూడా అలాగే ఉంచి ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇక ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య క్రమంగా తగ్గుతుంది. ఇలా వారానికి ఒక్కసారి చేయడం వల్ల చుండ్రు సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అందుకే చుండ్రు సమస్యతో బాధపడే వారు ఈ చిట్కాను పాటించడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.