ఈ ఫేస్ వాష్ వాడితే అంతులేని అందం ఖాయం?

Purushottham Vinay
ఈ రోజుల్లో బయట ఎక్కువగా వుండే దుమ్ము, ధూళి, కాలుష్యం, ఇంకా అలాగే అధిక మేకప్ కారణంగా చర్మ ఆరోగ్యం అనేది మరింత దిగజారిపోతుంది. చర్మ సంరక్షణలో బియ్యం నీళ్లు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అందువల్ల రైస్ వాటర్ ఫేస్ వాష్ అనేది ప్రస్తుత కాలంలో ట్రెండింగ్‌లో ఉంది.ఇక బియ్యం కడిగిన నీళ్తు చర్మానికి ఎంతో సహజమైన క్లెన్సర్‌గా పనిచేస్తుంది.అందుకే మార్కెట్లో దొరికే ప్రసిద్ధ బ్రాండ్ల రైస్ వాటర్ ఫేస్ వాష్‌లను కొనుగోలు చేసే బదులు ఇంట్లోనే సహజంగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ప్రతి రోజూ అన్నం వండేందుకు బియ్యం కడుగుతుంటారు. ఇక ఈ నీళ్లలో అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి చాలా మినరల్స్ ఉంటాయి. ఇది చర్మ ముడతలు, ఫైన్ లైన్లను ఈజీగా తొలగిస్తుంది. ఇంకా అలాగే చర్మాన్ని బిగుతుగా కూడా చేస్తుంది.బియ్యం కడిగిన నీళ్లు చర్మాన్ని శుభ్రపరచడంలో ఖచ్చితంగా కీలక పాత్ర పోషిస్తుంది. ఇది చర్మంపై పేరుకుపోయిన మేకప్, నూనెలను కూడా చాలా ఈజీగా తొలగిస్తుంది. ఇంకా అలాగే చర్మం pH స్థాయిని కూడా ఈజీగా క్రమబద్దీకరిస్తుంది.



అలాగే సీజన్ మారే సమయంలో గాలిలో తేమ కూడా క్రమంగా తగ్గుతుంది.దాని ఫలితంగా ఖచ్చితంగా చర్మం పొడిబారవచ్చు. కానీ బియ్యం నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం అనేది తేమగా ఉంటుంది. పొడి చర్మానికి క్లెన్సర్‌గా బియ్యం కడిగిన నీళ్లు చాలా బాగా ఉపయోగపడతాయి.ప్రతి రోజు మీరు బియ్యం నీళ్లతో ముఖంని బాగా శుభ్రం చేసుకోవచ్చు. చర్మ సంరక్షణలో ఇది ఆరోగ్యకరమైన ఇంకా చాలా మంచి పద్ధతి. ఇక బియ్యం కడిగిన నీళ్లు చర్మంపై సహజమైన క్లెన్సర్‌గా పనిచేస్తుంది. దీనిని ఎలా వినియోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ముందుగా మీరు బియ్యాన్ని కడిగి నీళ్లను స్ప్రే బాటిల్ నింపుకోవాలి. ఆ తరువాత బియ్యం కడిగిన నీటిని టోనర్ లాగా ముఖంపై స్ప్రే చేసుకోవాలి. తర్వాత కాటన్ బాల్‌తో ముఖాన్ని బాగా తుడుచుకోవాలి. ఇది చర్మ ఉపరితలంపై పేరుకుపోయిన మురికి, మేకప్ ఇంకా అలాగే నూనెలను చాలా ఈజీగా శుభ్రపరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: