మెంతులతో ఇలా చేస్తే మెరిసిపోవడం ఖాయం?

Purushottham Vinay
మన చర్మ సంరక్షణకు మెంతులు చాలా మంచివి. మెంతులు ఫైబర్, కొవ్వు, ఇనుము, రాగి, మెగ్నీషియం, భాస్వరం ఇంకా విటమిన్ B6 గొప్ప మూలం. ఇందులోని విటమిన్ సి చర్మాన్ని బొద్దుగా మార్చడానికి ఇంకా అలాగే అకాల వృద్ధాప్యం నుండి పోరాడటానికి సహాయపడుతుంది.మెంతి పేస్ట్, గోరువెచ్చని పాలు మిక్స్ చేసి మీ ముఖం ఇంకా మెడకు అప్లై చేయండి. ముఖంపై వచ్చే ముడతలకు ఇది చాలా మంచి మందు. మెంతుల్లో విటమిన్ సి అనేది ఉంటుంది. ఇది ముఖాన్ని బాగా మెరిసేలా చేస్తుంది.ఇక ఈ ప్యాక్‌ అప్లై చేయటం వల్ల మీ ముఖం చాలా అందంగా ఇంకా యవ్వనంగా మారుతుంది.మెంతులలో విటమిన్లు, పొటాషియం ఇంకా ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తాయి. అదే విధంగా చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని వేగవంతం చేయడానికి మెంతులు చాలా బాగా దోహదపడతాయి.


మెంతులని నీటిలో వేసి మరిగించి అవి చల్లారిన తర్వాత వడగట్టిన నీటిని మొటిమలపై ప్రతి రోజూ రాస్తే ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.రెండు టేబుల్‌ స్పూన్ల నానబెట్టిన మెంతి గింజలను తీసుకొని వాటిని గ్రైండ్ చేయండి. తరువాత దీనికి ఒక టేబుల్ స్పూన్ పెరుగు కలపండి. ఇక వీటిని బాగా కలిపిన తర్వాత ముఖానికి రాసుకోవచ్చు.ఒక 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో మీ ముఖాన్ని కడగాలి. ఇది టాక్సిన్స్ తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుంది.ఇక మెంతులను నానాబెట్టి గ్రైండ్ చేయగా తయారైన మొత్తటి మిశ్రమాన్ని ముఖంపై రుద్దడం వల్ల ముఖ చర్మం బిగుతుగా మారుతుంది. ముఖంపై ముడతలు కూడా చాలా ఈజీగా తొలగిపోతాయి. మనం కోల్పోయిన యవ్వనాన్ని పునరుద్ధరించడంలో మెంతులతో తయారు చేసిన ప్యాక్‌ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. అందమైన చర్మాన్ని సొంతం చేసుకోండి.మెంతులతో ఇలా చేస్తే మెరిసిపోవడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: