ఇలా చేస్తే జుట్టు వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది?

Purushottham Vinay
ప్రస్తుతం మనలో చాలా మంది కూడా జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యతో ఎంతగానో బాధపడుతున్నారు.తల చర్మం లోపలి పొరల్లో ఉండే కొల్లాజెన్ దెబ్బతినడం వల్ల జుట్టు కుదుళ్లు ఈజీగా బలహీన పడతున్నాయి. అందువల్ల జుట్టు ఎక్కువగా రాలుతుంది. జుట్టు ఎక్కువగా రాలడానికి గల కారణాల్లో ఖచ్చితంగా ఇది కూడా ఒకటి. జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవడానికి జుట్టును ఒత్తుగా ఇంకా పొడవుగా పెంచుకోవడానికి చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకోసం ఎంతో ఖరీదైన షాంపులను, నూనెలను వాడుతూ ఉంటారు. అయితే వీటిలో ఉండే రసాయనాల వల్ల జుట్టు మరింతగా ఊడిపోతుంది తప్ప ఎలాంటి ఫలితం ఉండదు. కానీ ఒక చిన్న చిట్కాను వాడడం వల్ల మనం చాలా ఈజీగా జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. ఈ టిప్ ని తయారు చేయడం కూడా చాలా ఈజీ.ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి మనం ఒకే ఒక పదార్థాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక అదేమిటో కాదు జామాకులు.



మనందరం జామపండ్లు మన ఆరోగ్యానికి మాత్రమే మేలు చేస్తాయని భావిస్తాము. కానీ జామాకులల్లో కూడా చాలా పోషకాలు, ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. మన జుట్టు ఆరోగ్యానికి కూడా జామాకులు చాలా మేలు చేస్తాయి. అయితే వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేయడంలో బాగా సహాయపడుతుంది. ఇంకా అలాగే వీటిలో లైకోపిన్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇది ఎండ నుండి జుట్టును కాపాడడంలో మనకు సహాయపడుతుంది. అయితే జుట్టు రాలే సమస్యతో బాధపడే వారు ఈ జామాకులను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జుట్టు రాలే సమస్యతో బాధపడే వారు ముందుగా జామాకులను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి.ఆ తరువాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల దాకా బాగా పట్టించాలి.దీనిని ఒక గంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత కుంకుడుకాయలతో శుభ్రంగా తలస్నానం చేయాలి.ఇలా వారానికి రెండు సార్లు ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం ఈజీగా తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: